షేర్ చాట్ ఎలా ప్రారంభమయ్యింది? సంస్థ ఆదాయ, వ్యయాలు ఎంతంటే...

8 సంవత్సరాల క్రితం ఐఐటీ కాన్పూర్‌కు చెందిన ముగ్గురు విద్యార్థులు కలిసి సోషల్ నెట్‌వర్కింగ్ షేర్‌చాట్ యాప్‌ను ప్రారంభించారు.

ఇది వినియోగదారులు తమ స్వంత కంటెంట్‌ను సృష్టించుకోవడంతో పాటు స్వయంగా డైరెక్ట్ చేసేందుకు అవకాశం కల్పించే యాప్.

ఈ యాప్ గూగుల్ ప్లే స్టోర్ నుంచి 3 మిలియన్ల కంటే ఎక్కువ సార్లు డౌన్‌లోడ్ అయ్యింది.

2015లో ముగ్గురు కలిసి ప్రారంభించిన ఈ కంపెనీలో నేడు 20 శాతం మంది ఉద్యోగాలు కోల్పోయారు.

షేర్ చాట్ యాప్ ఎలా ప్రారంభమైందో, అది విజయ శిఖరానికి ఎలా చేరిందో ఇప్పుడు తెలుసుకుందాం.

H3 Class=subheader-styleముగ్గురు యువకుల సారధ్యంలో/h3p ఒక ఇంటర్వ్యూలో షేర్‌చాట్ సహ వ్యవస్థాపకుడు ఫరీద్ ఎహ్సాన్ మాట్లాడుతూ ఐఐటి కాన్పూర్ నుండి గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, తన స్నేహితులతో కలిసి స్టార్టప్ ప్రారంభించాలని యోచించినట్లు చెప్పారు.

ఒకరికొకరు తెలియకుండా చాట్ చేసుకునే ప్లాట్‌ఫారమ్ భారతదేశంలో లేదని ఈ సమయంలో అతను గ్రహించాడు.

దీనిని రూపొందించిన్పుడు దాని పేరు ఓపెనియో.ఈ ప్లాట్‌ఫారమ్‌కు షేర్‌చాట్ అనే పేరు 2015లో వచ్చింది.

"""/"/ H3 Class=subheader-styleప్రారంభం నుంచే మంచి స్పందన/h3p షేర్‌చాట్‌ని ప్రారంభించిన తర్వాతే దానికి అత్యధిక యూజర్లు లభించారు.

ఇది ప్రారంభమైన సమయంలో దేశంలో దాదాపు 25 కోట్ల మంది ఇంటర్నెట్ వినియోగదారులు ఉన్నారు.

అందులో షేర్‌చాట్‌లో కేవలం 1 నుండి 2 కోట్ల మంది మాత్రమే చేరారు.

వారు వారి సొంత భాష మాత్రమే వాడేవారు.దీనిని గ్రహించిన షేర్ చాట్ నిర్వాహకులు యాప్‌ను దేశంలోని దాదాపు 15 భాషలలో అందుబాటులో ఉంచారు.

ఆ తర్వాత లెక్కకుమించి యూజర్లు పెరిగారు.h3 Class=subheader-styleషేర్ చాట్ తర్వాత మోజ్ ప్రారంభం/h3p 2020లో టిక్ టాక్ నిషేధించిన తర్వాత, వారు మోజ్ అనే యాప్‌ను ప్రారంభించారు.

టిక్ టాక్ వంటి చిన్న వీడియోలు దీనిలో అందుబాటులోకి వచ్చాయి.ఫరీద్ ఈ యాప్‌ను తీసుకురావడం వెనుక ఉన్న కారణాన్ని చెప్పాడు.

వినియోగదారులు చిన్న పట్టణం లేదా పెద్ద నగరానికి చెందినవారు కాబట్టి ఈ యాప్‌కి మోజ్ అని పేరు పెట్టారు.

"""/"/ H3 Class=subheader-styleఇలా ఆదాయాన్ని పొందవచ్చు/h3p షేర్‌చాట్ ప్రకటనల ద్వారా అధిక ఆదాయాన్ని పొందుతుంది.

ఇంతేకాకుండా తాము వర్చువల్ గిఫ్టింగ్, ఇన్‌ఫ్లుయెన్సర్ మార్కెటింగ్ ద్వారా కూడా ఆదాయాన్ని పొందుతామని నిర్వాహకులు తెలిపారు.

H3 Class=subheader-styleషేర్‌చాట్ ఆర్థిక పరిస్థితి/h3p ఒక నివేదిక ప్రకారం 2022 సంవత్సరంలో షేర్‌చాట్ ప్రకటనల ఆదాయం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 30 శాతం మేరకు పెరిగింది.

గతేడాది కంపెనీ వ్యయం రూ.3,407.

5 కోట్లు.నాన్-ఆపరేటింగ్ ఖర్చుల కారణంగా షేర్ చాట్ నష్టం రూ.

2498.6 కోట్ల నుంచి రూ.

2,988.6 కోట్లకు పెరిగింది.