ఇంత దారుణ‌మా.. రూ.5 చిల్ల‌ర లేవ‌న్నందుకు క‌స్ట‌మ‌ర్‌పై హోట‌ల్ సిబ్బంది దాడి..

అదేంటో గానీ ఈ మ‌ధ్య మ‌నుషులు మ‌రీ దారుణంగా ప్ర‌వ‌ర్తిస్తున్నారు.చిన్న చిన్న కార‌ణాల‌కే గొడ‌వ‌ల‌కు దిగుతున్నారు.

 Hotel Staff Attack On Customer For Not Retailing Rs 5, Hotel Staff Attack, Viral-TeluguStop.com

అస‌లు వారు చెప్పే కార‌ణం వింటే అది గొడ‌వ ప‌డేంత పెద్ద త‌ప్పా అని అనిపిస్తుంది.కానీ వారు మాత్రం చిన్న చిన్న కార‌ణాల‌ను సాకుగా చూపి గొడ‌వ ప‌డుతున్నారు.

ఇక మ‌నం సాధార‌ణంగా ఏదైనా హోటల్‌కి వెళ్లి టిఫిన్ లేదంటే భోజనం చేస్తే క‌చ్చితంగా డ‌బ్బులు ఇస్తాం.లేదంటే ఏమైనా కొద్దిగా డ‌బ్బులు తక్కువైతే మ‌ళ్లీ తెచ్చి ఇస్తాం అని చెప్తాం.

లేదంటే యజమానులు మ‌న‌తో కొద్దిసేపే వాదించి వ‌దిలేస్తారు.అంతేగానీ దాడులు చేయ‌రు క‌దా.

ఒక‌వేళ మ‌రీ బిల్లు వంద‌ల్లో ఉంటే గ‌న‌క కస్టమర్ల దగ్గర ఉన్న ఏవైనా కొన్ని విలువైన వస్తువులను తీసుకుని డ‌బ్బులు తెచ్చి ఇచ్చిన త‌ర్వాత వాటిని తీసుకెళ్లాల‌ని సూచిస్తారు.కానీ ఇప్పుడు మ‌నం చెప్పుకోబోయే యజమాని మాత్రం కేవ‌లం ఐదు రూపాయల కోసం ఏకంగా వినియోగ‌దారుడిపై విచక్షణరహితంగా కొట్ట‌డం ఇప్పుడు సంచ‌ల‌నం రేపుతోంది.

ఆ య‌జ‌మాని ఏకంగా త‌న కొడుకుతో కలిసి ఆ కస్టమర్‌పై విచ‌క్ష‌ణా ర‌హితంగా కొట్టాడు.అది కూడా చాలామంది చూస్తుండగానే ఇలా దాడి చేశాడు.అయితే ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది.

ఈ రాష్ట్రంలోని కియోంఝర్‌ జిల్లాలో నివాసం ఉంటున్న జితేంద్ర దేహురి రీసెంట్‌గా స్థానికంగా ఉండే ఓ హోటల్‌కు వెళ్లి భోజనం తిన్నాడు.కాగా ఆయ‌న తిన్న దానికి ఆ హోటల్‌ యజమాని మధు సాహు రూ.45 బిల్లు వేశాడు.కానీ జితేంద్ర త‌న ద‌గ్గ‌ర కేవ‌లం రూ.40 ఉన్నాయని, మిగ‌తా రూ.5 మళ్లీ వచ్చినప్పుడు ఇచ్చేస్తానని చెప్పి వెళ్లేందుకు ట్రై చేస్తాడు.కానీ సాహు మాత్రం ఎంత‌కూ ఒప్పుకోక తీవ్రం యజమాని ఆగ్రహంతో కస్టమర్‌ను బూతులు తిడ‌తారు.

దీంతో వారిద్ద‌రి మ‌ధ్య వాగ్వాదం జరుగుతుంది.ఇక ఇదే క్ర‌మంలో సాహు క‌స్ట‌మ‌ర్‌పై తన కుమారుడితో కలిసి దాడికి దిగుతాడు.

ఇదంతా ఇప్పుడు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube