సాధారణంగా మొటిమలు వస్తేనే చాలా చిరాకు వస్తుంది.అవి కొంతమందిలో తొందరగా తగ్గితే మరికొంతమందిలో చీము పట్టి చాలా ఇబ్బందిని కలిగిస్తాయి.
అలాంటప్పుడు కంగారు పడకుండా ఆ సమస్య నుండి ఇంటి చిట్కాల ద్వారా చాలా సులభంగా బయట పడవచ్చు.ఇప్పుడు ఆ చిట్కాల గురించి వివరంగా తెలుసుకుందాం.
ఒక స్పూన్ కొబ్బరి నూనెలో మూడు చుక్కల టీ ట్రీ ఆయిల్, చిటికెడు పసుపు కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా వారానికి రెండు సార్లు చేస్తే మంచి ఫలితం ఉంటుంది.
ఒక స్పూన్ నిమ్మరసంలో అరస్పూన్ ముల్తానా మట్టి వేసి పేస్ట్ చేయాలి.ఈ పేస్ట్ ని ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి మూడు సార్లు చేస్తే మంచి ఫలితం కనపడుతుంది.
ఒక స్పూన్ కలబంద జ్యుస్ లో అరస్పూన్ బేకింగ్ సోడా కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.ఈ విధంగా రోజు విడిచి రోజు చేస్తూ ఉంటే మంచి ఫలితం కనపడుతుంది.
బంగాళాదుంప తొక్కలను మెత్తని పేస్ట్ గా చేసి దానిలో గ్రీన్ టీ పొడిని కలిపి ప్రభావిత ప్రాంతంపై రాసి 5 నిమిషాల తర్వాత చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి.
ఈ విధంగా వారానికి ఒకసారి చేస్తే చీము పట్టిన మొటిమలు తగ్గటమే కాకుండా మచ్చలు కూడా తగ్గిపోతాయి.