ఫలక్‌నుమా దాస్ చిత్రంతో హీరోగా పరిచయం అయిన విశ్వక్‌సేన్ ఈ చిత్రంతో రెండవ ప్రయత్నం చేస్తున్నాడు.ఇదే సమయంలో అ! చిత్రంతో నిర్మాతగా మారిన నాని ఇదే సినిమాతో రెండవ ప్రయత్నంను చేస్తున్నాడు.
సినిమాపై ఆసక్తిని పెంచేలా విడుదలకు ముందే సినిమాకు సంబంధించిన కథను రివీల్ చేశారు.కనుక అంచనాలు భారీగా ఉన్నాయి.అంచనాలను ఈ సినిమా అందుకుందా లేదా అనేది ఈ రివ్యూలో చూద్దాం.
కథ :
విశ్వక్‌సేన్ పోలీస్ ఆఫీసర్.హిట్ అనే ఒక స్పెషల్ టీంను లీడ్ చేస్తూ ఉంటాడు.క్లిష్టమైన హత్య కేసులను ఈ టీం పరిష్కరిస్తూ ఉండగా వీరి వద్దకు ఒక హత్య కేసు వస్తుంది.
ఆ లేడీ హత్య కేసులో ట్విస్ట్‌లు చాలా ఉంటాయి.ఆ హత్య కేసుకు విశ్వక్‌కు పర్సనల్‌గా కూడా ఒక సంబంధం ఉంటుంది.ఇంతకు ఆ హత్య చేసింది ఎవరు? దాన్ని ఎలా సాల్వ్ చేశారు అనేది సినిమా కథ.
నటీనటు నటన :
మొదటి సినిమాతోనే నటుడిగా మంచి పేరును దక్కించుకున్న విశ్వక్ సేన్ ఈ చిత్రంతో మరోసారి మంచి నటుడు అనిపించుకున్నాడు.ముఖ్యంగా కొన్ని ఎమోషనల్ సీన్స్‌లో ఆకట్టుకున్నాడు.హీరోయిన్‌తో రొమాంటిక్ సీన్‌లో కూడా మెప్పించాడు.పోలీస్ పాత్రకు సరిగ్గా సూట్ అయ్యాడు.మొత్తానికి పాత్రకు పూర్తి న్యాయం చేశాడు.
ఇక హీరోయిన్ రుహాని శర్మకు ఎక్కువగా స్కోప్ లేదు.ఆమె స్క్రీన్ ప్రజెన్స్ కూడా తక్కువే ఉంది.
ఇక ఇతర పాత్రల్లో నటించిన వారు వారి పాత్రల పరిధిలో నటించే ప్రయత్నం చేశారు.
టెక్నికల్ :
సంగీతం గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏమీ లేదు.అయితే కొన్ని సీన్స్‌లో మాత్రం బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది.సినిమాపై ఇంట్రెస్ట్ కలిగేలా, సినిమాలో ఇన్వాల్వ్ అయ్యేలా సంగీత దర్శకుడు వర్క్ చేశాడు.
ఇక సినిమాటోగ్రఫీ బాగుంది.కొన్ని సీన్స్‌ను చాలా నాచురల్‌గా చిత్రీకరించడంలో ఈ సినిమాటోగ్రఫీ బాగుంది.
క్రైమ్ స్పాట్‌లోని సీన్స్‌కు సినిమాటోగ్రఫీ ప్రాణం పోసినట్లుగా ఉంది.ఎడిటింగ్‌లో లోపాలున్నాయి.
ముఖ్యంగా సెకండ్ హాఫ్‌లో కథనం స్లోగా సాగి బోర్ అనిపించింది.దర్శకుడు ఇంకాస్త ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్‌ను యాడ్ చేసి ఉంటే బాగుండేది.
నిర్మాణాత్మక విలువలు బాగున్నాయి.
విశ్లేషణ :
నాని నిర్మాత అనగానే అందరిలో ఆసక్తి కలిగింది.ప్రీ రిలీజ్ వేడుకకు ప్రముఖులను తీసుకు వచ్చి బాగానే పబ్లిసిటీ చేశాడు.దాంతో సినిమాపై అందరిలో ఆసక్తి కలిగింది.ఆ ఆసక్తికి తగ్గట్లుగా సినిమా ఉందని చెప్పుకోవచ్చు.అయితే ఇది అన్ని వర్గాల వారిని ఆకట్టుకోవడం కష్టమే.
ఇలాంటి జోనర్ సినిమాలు కమర్షియల్ ప్రేక్షకులను మెప్పించలేవు.ఇందులో కమర్షియల్ ఎలిమెంట్స్ ఎక్కువగా లేకపోవడంతో వారు ఒప్పుకోక పోవచ్చు.
మొత్తంగా చూస్తే క్రైమ్ థ్ల్రిర్.సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రాలను కోరుకునే వారు ఈ సినిమాను ఇష్టపడతారు.
ప్లస్ పాయింట్స్ :
కథలో ట్విస్ట్, ఇన్వెస్టిగేషన్ సీన్స్, కొన్ని రొమాంటిక్ సీన్స్,
మైనస్ పాయింట్స్ :
స్క్రీన్‌ప్లే, కమర్షియల్ ఎలిమెంట్స్ లేవు, ఎడిటింగ్, సంగీతం.
బోటమ్ లైన్ : ‘హిట్’ వారికి మాత్రమే నచ్చుతుంది.