త్రిబుల్ రోల్స్ లో నటించి మెప్పించిన స్టార్ హీరోల లిస్ట్ ఇదే!

సినిమా అంటే మామూలు విషయం కాదు.నటీనటులు ప్రాణం పెట్టి నటిస్తేనే ఏ సినిమా అయినా విజవంతం అవుతుంది.

 Heros Who Are Acted In More Than Triple Roles , Nandamuri Taraka Ramarao, Akkine-TeluguStop.com

ముఖ్యంగా పెద్ద సినిమాలకి హీరోలే ప్రధాన అసెట్.వారు స్క్రీన్ పై కనిపిస్తే ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతారు.

విజిల్స్ వేస్తూ రెచ్చిపోతారు.అలాంటి హీరో డబుల్ యాక్షన్ లో నటిస్తే ఇక ఆ సినిమా ఆడినన్ని రోజులు ఆయా ఫ్యాన్స్ కి పండగే అని చెప్పుకోవచ్చు.

కానీ., మీకు తెలుసా? డ్యూయల్ రోల్ చేసిన హీరోలు చాలా మందే ఉన్నారు.కానీ., త్రిబుల్ రోల్ లో నటించి మెప్పించిన స్టార్స్ మాత్రం తక్కువ మందే ఉన్నారు.మరి ఇలాంటి అరుదైన అవకాశాన్ని దక్కించుకుని శబాష్ అనిపించుకున్న ఆ స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.

శ్రీమద్విరాటపర్వం, శ్రీకృష్ణసత్య, దాన వీర సూర కర్ణ వంటి సినిమాలలో యన్టీఆర్ త్రిబుల్ రోల్స్ లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు.

ఇక యన్టీఆర్ తరువాత మూడు లేదు అంతకన్నా ఎక్కువ పాత్రలలో నటించిన స్టార్ లెజండ్రీ నటుడు అక్కినేని నాగేశ్వర రావు .ఈయన నవరాత్రి సినిమా కోసం 9 పాత్రల్లో నటించి ప్రేక్షకులను మెస్మరైజ్ చేశారు.ఇక ప్రయోగాలకి మారు పేరు అయిన సూపర్ స్టార్ కృష్ణ త్రిబుల్ రోల్ లో నటించకుండా ఉంటారా? సూపర్ స్టార్ కృష్ణ కుమార్ రాజా, రక్తసంబంధం, పగబట్టిన సింహం, బంగారు కాపురం, బొబ్బిలి దొర అంటూ ఇలా మొత్తం ఏడు సినిమాల్లో మూడు పాత్రల్లో కనిపించారు.

Telugu Heros Triple, Krishna, Nandamuritaraka, Tollywood, Triple Heros-Telugu St

ఇక శోభన్ బాబు, మెగాస్టార్ చిరంజీవి ఇద్దరు కూడా ముగ్గురు మొనగాళ్ళు అనే కామన్ నేమ్ గల రెండు వేరు వేరు సినిమాల్లో త్రిబుల్ రోల్స్ వేశారు.ఇక వేషాలు కట్టే విషయంలో సీనియర్ హీరో కమలహాసన్ గురించి ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన అవసరం లేదు.విచిత్ర సోదరులు సినిమాలో ఆయన మూడు పాత్రల్లో నటించగా, మైఖేల్ మదన కామ రాజు సినిమాకి వచ్చే సరికి ఆ సంఖ్య నాలుగుకి చేరింది.

ఇక కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో వచ్చిన దశావతారం సినిమాలో కమల్ పది పాత్రలలో కనిపించిన విషయం అందరికీ తెలిసిన విషయమే.

Telugu Heros Triple, Krishna, Nandamuritaraka, Tollywood, Triple Heros-Telugu St

యువరత్న నందమూరి బాలకృష్ణ తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్న హీరో .మరి.ఈయన త్రిబుల్ రోల్ చేయకుండా ఎలా ఉంటాడు? అధినాయకుడు సినిమాలో తాత, తండ్రి, మ‌న‌వ‌డిగా బాలకృష్ణ త్రిబుల్ రోల్స్ చేశారు.ఇక అదే నందమూరి కుటుంబంలో తన తాత అంశలో పుట్టిన జూనియర్ యన్టీఆర్ కూడా త్రిబుల్ రోల్స్ చేశారు.జై లవకుశ సినిమాలో మూడు పాత్రల్లో విశ్వరూపం చూపించారు తారక్.

ఇవన్నీ సీరియస్ రోల్స్ అయితే.కామెడీ స్టార్ సంపూర్ణేష్ బాబు కూడా ఈ లిస్ట్ లో ప్లేస్ సంపాదించారు.

కొబ్బరి మట్ట సినిమా లో సంపూ పాపారాయుడు, పెద్దరాయుడు, ఆండ్రాయిడు పాత్రల్లో నటించి ప్రేక్షకులని నవ్వించారు.మరి.చూశారు కదా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube