సినిమాల విషయంలో అలాంటి వాటిని అస్సలు పట్టించుకోను: శృతిహాసన్

Heroine Shruti Haasan Interesting Comments About Her Movies Selection Details, Shruthi Hassan,Chiranjeevi,Balakrishna,Salar, Heroine Shruti Haasan , Prabhas, Shruti Haasan Movies, Prasanth Neel,

లెజెండరీ యాక్టర్ కమల్ హాసన్ కుమార్తెగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి కెరియర్ మొదట్లో ఎన్నో ఒడిదుడుకులు అవమానాలను ఎదుర్కొన్నటువంటి శృతిహాసన్ (Shruthi Hassan) ప్రస్తుతం ఇండస్ట్రీలో అగ్రతారగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి శృతిహాసన్ తాజాగా బాలకృష్ణ చిరంజీవి(Chiranjeevi) సరసన నటించిన విషయం మనకు తెలిసిందే.

 Heroine Shruti Haasan Interesting Comments About Her Movies Selection Details, S-TeluguStop.com

ఇలా యంగ్ హీరోల సరసన నటించాల్సిన శృతిహాసన్ ఏకంగా 60 ప్లస్ హీరోలతో నటించడంతో అప్పట్లో ఇది పెద్ద ఎత్తున సంచలనగా మారింది.

శృతిహాసన్ అగ్ర హీరోల సరసన కేవలం రెమ్యూనరేషన్ కోసమే నటిస్తున్నారని కామెంట్లు కూడా వినపడ్డాయి.అయితే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి శృతిహాసన్ ఈ విషయాల గురించి ఆసక్తికరమైన సమాధానాలు చెప్పారు.ఈ సందర్భంగా శృతిహాసన్ ఈ విషయం గురించి మాట్లాడుతూ తాను ఒక సినిమాకి సైన్ చేసేటప్పుడు కథ ఏంటి కథలో తన పాత్ర పాత్రకు ప్రాధాన్యత ఏంటి అనే విషయాలను మాత్రమే ఆలోచిస్తానని తెలిపారు.

అలా కాకుండా ఆ సినిమాలో హీరో ఎవరు? ఆ సినిమా ఏ బ్యానర్ లో వస్తుంది అనే విషయాలను తాను ఆలోచించనని తెలిపారు.

ఇక హీరో వయసెంత తనకు నాకు ఏజ్ గ్యాప్ ఎంత ఉంది అనే విషయాల గురించి తాను ఏ మాత్రం పట్టించుకోనని తెలియజేశారు.లెజెండ్స్ తో పనిచేసే అవకాశం మనకు మళ్ళీ మళ్ళీ దొరకదు.బాలకృష్ణ (Balakrishna) చిరంజీవి లెజెండరీ హీరోలు అలాంటి వారి పక్కన నటించడం తనకు చాలా హ్యాపీగా ఉందని ఈ సందర్భంగా శృతిహాసన్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఇక ప్రస్తుతం ఈమె ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్ (Salar) సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్నారు.ప్రశాంత్‌ నీల్‌ సృష్టించిన లోకం తనకు ఎంతో ఇష్టమని చెప్పారు.

కేజీయప్‌ కాన్సెప్ట్ కి, ఆ వరల్డ్ కి తాను పెద్ద ఫ్యాన్‌ని అని శ్రుతిహాసన్‌ వెల్లడించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube