సాధారణంగా సినిమా హీరోల ఫ్యామిలీ ల గురించి తెలుసుకోవడానికి అందరూ ఆసక్తి చూపుతుంటారు.ఇక ఇలా సినిమా సెలబ్రిటీలకు సంబంధించిన ఏదైనా విషయం సోషల్ మీడియా లోకి వస్తే అది క్షణాల వ్యవధిలో వైరల్ గా మారిపోవడం పక్క.
ఇక ఇప్పుడు హీరో రాజశేఖర్ ఫ్యామిలీ గురించి ఒక వార్త అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.హీరో రాజశేఖర్ అనగానే ఒకప్పటి హీరోయిన్ జీవిత కూతుర్లు శివాని, శివాత్మిక మాత్రమే గుర్తుకు వస్తూ ఉంటారు.
ఇక వీరందరూ సినిమా ఇండస్ట్రీకి పరిచయం ఉన్న వారే.జీవిత రాజశేఖర్ కూతుర్లు శివాత్మిక, శివాని ప్రస్తుతం హీరోయిన్లుగా కొనసాగుతుండగా.ఇక జీవిత హీరోయిన్ గా , దర్శకురాలిగా గుర్తింపు సంపాదించుకుంది.ఇక హీరో రాజశేఖర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.వీరి గురించి చెప్పమంటే ఎవరైనా టక్కున చెప్పేస్తారు.కానీ హీరో రాజశేఖర్ కి ఒక తమ్ముడు ఉన్నాడు అని.ఆ తమ్ముడు ఒక పెద్ద బిజినెస్ మేన్ అని.హీరో రాజశేఖర్ తమ్ముడు పెళ్లి చేసుకున్న అమ్మాయి స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ కూతురు అన్న విషయం చాలా మందికి తెలియదు.
హీరో రాజశేఖర్ కి గుణశేఖర్ అనే తమ్ముడు ఉన్నాడు.రాజా శేఖర్ తమ్ముడు వజ్రాల వ్యాపారం చేస్తూ ఉంటాడట.హైదరాబాదులో ఉన్న గుణ డైమండ్స్ స్టోర్ లకి ఇక రాజశేఖర్ తమ్ముడు యజమాని.రాజ శేఖర్ తమ్ముడు గుణశేఖర్ తమిళ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గణేష్ కూతురు శ్రీదేవిని పెళ్లి చేసుకున్నారట.
ఇక ఇటీవల ఈ విషయాన్ని తమిళ మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గణేష్ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.తన కూతురు హీరో రాజశేఖర్ తమ్ముడు గుణశేఖర్ భార్య అన్న విషయం ఎవరికీ తెలియదు అంటూ తెలిపాడూ.
మా అల్లుడి పెద్ద వజ్రాల వ్యాపారి అంటూ అసలు విషయాన్నిచెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ శంకర్ గణేష్.