ప్రభాస్ ఆ హిట్ సినిమాని మిస్ అయ్యాడా..?

తెలుగులో టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు ప్రముఖ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం లో తెరకెక్కిన సింహాద్రి చిత్రం బాక్సాఫీస్ వద్ద ఘన విజయం సాధించిన సంగతి అందరికి తెలిసిందే.అయితే ఈ చిత్రంలో హీరోయిన్లుగా హీరోయిన్ భూమిక, అంకిత తదితరులు నటించగా నాజర్, సీనియర్ హీరోయిన్ సీత, బ్రహ్మానందం, సమీర్, ముఖేష్ రుషి, శరత్ సక్సేనా, రాహుల్ దేవ్ తదితరులు ప్రధాన తారాగణంగా నటించారు.

 Hero Prabhas Reject The Simhadri Movie For Flashback Scene Script Changes, Simha-TeluguStop.com

అయితే అప్పుడప్పుడే దర్శకుడిగా ఓనమాలు దిద్దుకుంటున్న దర్శకుడు రాజమౌళి సింహాద్రి చిత్రంతో బ్లాక్ బాస్టర్ హిట్ అందుకోవడంతో ఒక్కసారిగా సినీ ఇండస్ట్రీలో తన సత్తా నిరూపించుకున్నాడు.దాంతో అప్పటి నుంచి దర్శకుడు రాజమౌళి చిత్రాలకి టాలీవుడ్ సినిమా పరిశ్రమలో మంచి క్రేజ్ ఏర్పడింది.

అయితే సింహాద్రి చిత్రం స్క్రిప్ట్ గురించి తాజాగా సోషల్ మీడియా మాధ్యమాలలో ఓ వార్త తెగ వైరల్ అవుతోంది.ఇంతకీ ఆ వార్త ఏమిటంటే మొదటగా జక్కన్న ఎస్.ఎస్.రాజమౌళి ఈ చిత్ర కథని టాలీవుడ్ యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ కి వినిపించాడట.కానీ ప్రభాస్ ఫ్లాష్ బ్యాక్ కథలో కొంతమేర మార్పులు, చేర్పులు కావాలని అడగడంతో అలా చేయడం వల్ల పూర్తిగా కథ మీద ప్రభావం పడుతుందని జక్కన్న రాజమౌళి నో చెప్పాడట.ఆ విధంగా రెబల్ స్టార్ ప్రభాస్ సింహాద్రి చిత్రంలో హీరోగా నటించే అవకాశాన్ని కోల్పోయాడని కొందరు చర్చించుకుంటున్నారు.

ఆ తర్వాత ఈ స్క్రిప్ట్ నందమూరి బాలకృష్ణ దగ్గరికి వెళ్లినప్పటికీ బాలయ్య బాబు మాత్రం తన కటౌట్ కి ఈ చిత్రం సూటవ్వదని యంగ్ టైగర్ ఎన్టీఆర్ కి సూచించాడట.దాంతో భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రం దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి కి మరియు అటు హీరో జూనియర్ ఎన్టీఆర్ కి మంచి విజయాన్ని సాధించి పెట్టింది.అంతేగాక అప్పట్లోనే నైజాం, సీడెడ్ ప్రాంతాలలో వంద రోజులకు పైగా ఆడి దర్శక నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది.

Telugu Prabhasreject, Prabhas, Simhadri, Ss Rajamouli, Tollywood-Movie

ఈ విషయం ఇలా ఉండగా ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఆర్ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో మెయిన్ లీడ్ పాత్రలో నటిస్తున్నాడు.కాగా ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ సభ్యులు సన్నాహాలు చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube