మిగిలిన సీజన్స్‌తో పోలిస్తే.వర్షాకాలంలో అనేక రోగాల బారిన పడే రిస్క్ ఎక్కువగా ఉంటుందన్న సంగతి తెలిసిందే.
ముఖ్యంగా వర్షాల వల్ల వైరల్ జ్వరం, మెదడు వాపు, టైఫాయిడ్, డెంగ్యూ అలెర్జీలు వంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువగా వస్తుంటాయి.వీటి నుంచి సంరక్షించుకోవాలంటే.
వర్షాకాలంలో మరింత అప్రమత్తంగా ఉండాలి.అదే సమయంలో రోగాలతో పోరాడే రోగనిరోధక శక్తిని కూడా బలపరుచుకోవాలి.
ఇక రోగనిరోధక శక్తి పెరగాలంటే.వర్షాకాలంలో ఖచ్చితంగా కొన్ని కూరగాయలు తినాల్సిందే.
అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈ వర్షాకాలంలో కాకర కాయను తప్పకుండా తీసుకోవాలి.
చేదుగా ఉండే కాకరకాయ చాలా మంది తినడానికి ఇష్టపడరు.కానీ, ఈ కాకర కాయ ఎన్నో ఔషాధాల సమ్మేళనం అని వైద్యులు నొక్కి వక్కాణిస్తున్నారు.
ముఖ్యంగా ఈ కాలంలో కాకర కాయ చేదే ఒంటికి చాలా మేలు చేస్తుంది.కాకర కాయ లో ఉండే విటమిన్ సీ మరియు యాంటీ వైరల్ ప్రాపర్టీస్ ఇంఫెక్షన్స్ నించి రక్షిస్తాయి.
అలాగే కాకర కాయ తీసుకోవడం వల్ల శరీరంలో అధికంగా ఉన్న కొవ్వు కరుగుతుంది.జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది.
బీట్రూట్ను కూడా వర్షకాలంలో తప్పకుండా తీసుకోవాలి.బీట్రూట్లో ఉండే ఔషధగుణాలు శరీరంలో రోగనిరోధక శక్తిని బలపరచడంతో పాటు ఎర్ర రక్త కణాలను కూడా పెంచుతుంది.అలాగే బీట్రూట్ వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది.గుండె ఆరోగ్యానికి కూడా బీట్రూట్ ఎంతో మేలు చేస్తుంది.
అలాగే ఈ సీజిన్లో సొర కాయను కూడా ఖచ్చితంగా తీసుకోవాలి.ఇందులో ఉండే ఐరన్, విటమిన్ బీ, విటమిన్ సీ రోగనిరోధక శక్తిని పెంచుతాయి.
వర్షాకాలంలో తప్పనిసరిగా తినాల్సిన మరో గొప్ప కూరగాయ పొట్లకాయ.ఎందుకంటే.ఇందులో ఉండే యాంటీపైరెటిక్ చర్య వర్షాకాలంలో జ్వరం, దగ్గు మరియు వైరల్ జ్వరాల నుంచి రక్షిస్తుంది.అలాగే బంగాళదుంపలు, చిలగడ దుంపలు, ముల్లంగి, క్యారెట్ ఇలా దుంప జాతికి చెందినవి వార్షకాలంలో తీసుకుంటే.
ఆరోగ్యానికి చాలా మంచిది.