టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలైన చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్, నాగార్జునల మధ్య కొన్నేళ్ల క్రితం వరకు గట్టి పోటీ ఉండేది.ఆ సమయంలో చిరంజీవి నంబర్ వన్ స్థానంలో ఉండగా కొన్నిసార్లు బాలయ్య కూడా నంబర్ వన్ స్థానంలోకి వచ్చినా అదే స్థానాన్ని కొనసాగించడంలో ఆయన ఫెయిల్ అయ్యారు.
చిరంజీవి తొలి స్థానంలో ఉన్న సమయంలో బాలయ్య రెండో స్థానంలో ఉన్నారు.వెంకటేష్, నాగార్జునలకు సంబంధించి 3, 4 స్థానాలు తారుమారవుతూ ఉండేవి.
అయితే ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోలలో నంబర్ వన్ హీరో ఎవరనే ప్రశ్నకు చిరంజీవి పేరే సమాధానంగా వినిపిస్తోంది.సీనియర్ స్టార్ హీరోలలో వరుసగా 100 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించిన రెండు సినిమాలు ఉన్న హీరో ఎవరనే ప్రశ్నకు చిరంజీవి పేరు సమాధానంగా వినిపిస్తోంది.
ఖైదీ నంబర్ 150, సైరా నరసింహారెడ్డి సినిమాలతో చిరంజీవి ఈ అరుదైన ఘనతను ఖాతాలో వేసుకున్నారు.
గతేడాది అఖండ సినిమాతో 75 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించి కెరీర్ బిగ్గెస్ట్ హిట్ ను ఖాతాలో వేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం రెండో స్థానంలో ఉన్నారు.వెంకటేష్ ఈ జాబితాలో వరుస విజయాలతో మూడో స్థానంలో ఉండగా నాగార్జున ఈ జాబితాలో నాలుగో స్థానంలో ఉన్నారు.గత కొన్నేళ్లలో నాగార్జున నటించిన సినిమాలలో ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో సక్సెస్ సాధించలేదు.
బంగార్రాజు 40 కోట్ల రూపాయలకు పైగా షేర్ కలెక్షన్లను సాధించినా ఈ సినిమా తెలంగాణలో బ్రేక్ ఈవెన్ కాలేదనే సంగతి తెలిసిందే.సీనియర్ స్టార్ హీరోలు వరుసగా విజయాలను సొంతం చేసుకుని మరికొన్ని సంవత్సరాల పాటు బాక్సాఫీస్ వద్ద సత్తా చాటాలని అభిమానులు భావిస్తున్నారు.మరి నాగ్ సక్సెస్ ట్రాక్ లోకి వచ్చి వరుస సక్సెస్ లను అందుకుంటారేమో చూడాలి.