ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్ గురించి విన్నారా.. ఇక ఇందులో చేరాలంటే..?

ప్రపంచవ్యాప్తంగా అత్యంత ఖరీదైన వస్తువులు, హోటళ్లు చాలా ఉంటాయి.అలాగే అత్యంత విలువైన పురాతన వస్తువులు చాలా ఉంటాయి.

 Have You Heard About The Most Expensive Club In The World, Have You Heard , 33 R-TeluguStop.com

ఇక పెద్ద పెద్ద స్టార్ హోటళ్లు అత్యంత ఖరీదైనవి ఉంటాయి.ఇక దుస్తులు, వాచ్ లు, ఫోన్ల లాంటివి కూడా అత్యంత ధర కలిగినవి ఉంటాయి.

అయితే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్ గురించి మీరు ఎప్పుడైనా విన్నారా.

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్లబ్( expensive club ) గా క్లబ్ 33 ఉంది.ఈ క్లబ్ 33 అనేది డిస్నీలాండ్( Disneyland ) కి సంబంధించినది.దీనిలో సభ్యత్వం కోసమే ఎంట్రీ ఫీజు 50 వేల డాలర్లు ఉంటుంది.అంటే రూ.41.02 లక్షలు ఉంటుంది.ఇక వార్షిక ఫీజు 15 వేల డాలర్లు(రూ.12.30 లక్షలు) ఉంటుంది.1967లో ఈ క్లబ్ ను ఏర్పాటు చేశారు.ఈ క్లబ్ ను తర్వాతి కాలంలో చాలా ప్రాంతాలకు విస్తరించారు.

టోక్యో, షాంఘైతో( Tokyo , Shanghai ) పాటు ప్లోరిడాలోని డిస్నీ ల్యాండ్ పార్కులో శాఖలను ఏర్పాటు చేశారు.అత్యంత విలక్షణమైన డిన్నర్ క్లబ్బులలో ఇది ఒకటిగా పేరు తెచ్చుకుంది.

న్యూ ఆలీన్జ్ స్క్వేర్‌లోని 33 రాయల్ స్ట్రీట్‌లో( 33 Royal Street in New Orleans Square ) ఈ క్లబ్ ఉంటుంది.స్ట్రీట్ పేరు ఆధారంగా ఈ క్లబ్ కు ఆ పేరు పెట్టారు.అయితే హాలీవుడ్ సెలబ్రెటీలు ఎక్కువగా ఇక్కడ గడుపుతారు.అత్యంత ఖరీదైన ఈ క్లబ్ లో పాపులర్ హాలీవుడ్ సెలబ్రెటీలు డిన్నర్ పార్టీలు చేసుకుంటారు.తొలుత డిస్నీలాండ్ కార్పొరేట్ స్పాన్సర్లకు మాత్రమే ఇందులోకి ఎంట్రీ ఉండేది.కానీ వాల్ట్ డిస్నీ మరణం తర్వాత వీవీఐపీలకు కూడా ప్రవేశం కల్పించాలని నిర్ణయించారు.

ఇందుకోసం ఎంట్రీ ఫీజును భారీగా పెట్టారు.పెద్ద పెద్ద హాలీవుడ్ సెలబ్రెటీలు ఈ క్లబ్ ను సందర్శిస్తుండటంతో.

అత్యంత ఖరీదైనదిగా పేరు తెచ్చుకుంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube