అమెరికాలో 2.50 లక్షల మందికి శిక్షణ

అమెరికాలోని నిరుద్యోగ అమెరికన్స్ ఉద్యోగ కల్పనే ద్యేయంగా గూగుల్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది.ఇప్పటికే పలు శిక్షణా తరగతులు నిర్వహించిన గూగుల్ తాజాగా మరో సారి అమెరికన్స్ కి ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా శిక్షణ ఇవ్వనుందని తెలిపింది.

 Google Ceo Pichai Announces Tech Job Training Initiative For Americans-TeluguStop.com

ఈ మేరకు గూగుల్ సీఈవో ఇండో అమెరికన్ సుందర్ పిచాయ్ ప్రకటించారు.

అమెరికాలో ఉంటున్న యువకులలో సుమారు 2.50 లక్షల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలని కల్పించడమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.డల్లాస్ లోని ఎల్ సెరంట్రో కమ్యునిటీ హాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుందర్ పిచాయ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సమక్షంలో ఈ ప్రకటన చేశారు.వచ్చే ఐదేళ్ళలో అమెరికాలో సుమారు 2.50 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు.

Telugu Googleceo, Professionals, Learn-

అమెరికాకి అమెరికాలోని నిరుద్యోగ , విద్యార్ధులకి మొదటి ప్రాధ్యానతని ఇచ్చే కంపెనీలలో గూగుల్ ఎప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు.అమెరికన్ పౌరులకి కార్పోరేట్ కంపెనీలు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ట్రంప్ 2018 లోనే ప్రారంభించారు.ఈ క్రమంలోనే గూగుల్ ఇప్పటికే పలు శిక్షణలు జరిపింది కూడా.తాజాగా సుందర్ పిచాయ్ 2.50 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పడంతో అమెరికన్స్ సుందర్ పిచాయ్ కి ధన్యవాదాలు తెలిపుతున్నారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube