అమెరికాలో 2.50 లక్షల మందికి శిక్షణ
TeluguStop.com
అమెరికాలోని నిరుద్యోగ అమెరికన్స్ ఉద్యోగ కల్పనే ద్యేయంగా గూగుల్ శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేయనుంది.
ఇప్పటికే పలు శిక్షణా తరగతులు నిర్వహించిన గూగుల్ తాజాగా మరో సారి అమెరికన్స్ కి ఉద్యోగాలు కల్పించేందుకు వీలుగా శిక్షణ ఇవ్వనుందని తెలిపింది.
ఈ మేరకు గూగుల్ సీఈవో ఇండో అమెరికన్ సుందర్ పిచాయ్ ప్రకటించారు.అమెరికాలో ఉంటున్న యువకులలో సుమారు 2.
50 లక్షల మందికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలని కల్పించడమే తమ ధ్యేయమని ఆయన పేర్కొన్నారు.
డల్లాస్ లోని ఎల్ సెరంట్రో కమ్యునిటీ హాల్ లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న సుందర్ పిచాయ్, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కుమార్తె ఇవాంకా ట్రంప్ సమక్షంలో ఈ ప్రకటన చేశారు.
వచ్చే ఐదేళ్ళలో అమెరికాలో సుమారు 2.50 లక్షల ఉద్యోగాలు కల్పించడమే తమ లక్ష్యమని అన్నారు.
"""/"/
అమెరికాకి అమెరికాలోని నిరుద్యోగ , విద్యార్ధులకి మొదటి ప్రాధ్యానతని ఇచ్చే కంపెనీలలో గూగుల్ ఎప్పుడూ ముందు ఉంటుందని తెలిపారు.
అమెరికన్ పౌరులకి కార్పోరేట్ కంపెనీలు శిక్షణ ఇచ్చే కార్యక్రమాన్ని ట్రంప్ 2018 లోనే ప్రారంభించారు.
ఈ క్రమంలోనే గూగుల్ ఇప్పటికే పలు శిక్షణలు జరిపింది కూడా.తాజాగా సుందర్ పిచాయ్ 2.
50 లక్షల ఉద్యోగాల కల్పన చేస్తామని చెప్పడంతో అమెరికన్స్ సుందర్ పిచాయ్ కి ధన్యవాదాలు తెలిపుతున్నారు.
ఎక్కిళ్ళు ఎందుకు వస్తాయి.. వాటిని ఆపడం ఎలా..?