రామ్ చరణ్ శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న గేమ్ ఛేంజర్ మూవీ( Game Changer ) షూట్ మొదలై దాదాపుగా రెండు సంవత్సరాలు అవుతోంది.అయితే ఈ సినిమాకు భారీ స్థాయిలో ఖర్చు అవుతున్నా బిజినెస్ సైతం అదే స్థాయిలో జరుగుతోంది.
ఈ సినిమా డిజిటల్ హక్కులు ఏకంగా 270 కోట్ల రూపాయలకు అమ్ముడైనట్లు టాక్ వినిపిస్తోంది.వైరల్ అవుతున్న వార్త నిజమైతే నాన్ థియేట్రికల్ హక్కులతోనే( Non Theatrical Rights ) ఈ సినిమా సేఫ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
టాలీవుడ్ చరిత్రలోనే గేమ్ ఛేంజర్ సినిమా స్థాయిలో హక్కులు అమ్ముడవడం ఏ సినిమా విషయంలో జరగలేదని కూడా కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.దిల్ రాజు( Dil Raju ) మాస్టర్ మైండ్ వల్లే ఈ సినిమాకు ఈ రేంజ్ లో బిజినెస్ సాధ్యమైందని తెలుస్తోంది.గేమ్ ఛేంజర్ మూవీ బాక్సాఫీస్ లెక్కల విషయంలో కూడా గేమ్ ఛేంజర్ అవుతుందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం హాట్ టాపిక్ అవుతోంది.
రామ్ చరణ్( Ram Charan ) నుంచి ఆచార్య తర్వాత వస్తున్న సినిమా కావడంతో గేమ్ ఛేంజర్ కలెక్షన్లు సైతం భారీగా ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
కియారా అద్వానీ( Kiara Advani )కి కూడా తెలుగులో ఈ సినిమా కీలకం కానుంది.ఈ మూవీ సక్సెస్ సాధిస్తే మాత్రమే తెలుగులో కియారా అద్వానీకి ఆఫర్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంటుందని చెప్పవచ్చు.
కియారా ఈ సినిమాకు 5 కోట్ల రూపాయల రేంజ్ లో అందుకున్నారు.
గేమ్ ఛేంజర్ సినిమాకు థమన్ మ్యూజిక్( Thaman ) అందించగా ఈ సినిమా నుంచి లీకైన సాంగ్ సినిమాపై అంచనాలను తగ్గించేసింది.ఆ సాంగ్ లిరిక్స్ విషయంలో దారుణంగా ట్రోల్స్ వచ్చాయి.దిల్ రాజు సైతం గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ గురించి క్లారిటీ ఇచ్చే విషయంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలుస్తోంది.
గేమ్ ఛేంజర్ సినిమా రికార్డులు క్రియేట్ చేయాలని అభిమానులు కోరుకుంటున్నారు.