చిన్నారుల గుండెకు అభయం.. ఫిజీలో చిల్డ్రన్స్ హాస్పిటల్, భారత సంతతి ఎన్జీవోల కీలకపాత్ర

భారత్, అమెరికా, సింగపూర్, ఆస్ట్రేలియాతో సహా ఇండో పసిఫిక్ ప్రాంతంలోని ప్రజాస్వామ్య దేశాలు ఫిజీలో గుండె జబ్బులతో బాధపడుతున్న పిల్లలకు ఉచిత చికిత్స కోసం అత్యాధునిక ఆసుపత్రిని నెలకొల్పేందుకు చేతులు కలిపాయి.ఫిజీలో భారత మూలాలున్న ప్రజలు గణనీయమైన సంఖ్యలో వున్నారు.

 Free Heart Hospital For Children In Fiji Inaugurated,children, Fiji,free Heart H-TeluguStop.com

దీనికి సంబంధించి ఆసియా అమెరికన్లు, స్థానిక హవాయిలు, పసిఫిక్ ద్వీపవాసులపై యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్ అడ్వైజరీ కమీషన్ సభ్యుడు అజయ్ భూటోరియా మాట్లాడుతూ.సాయి ప్రేమ ఫౌండేషన్ ఆధ్వర్యంలో గత వారం ఫిజీలో శ్రీ సత్యసాయి సంజీవని హార్ట్ హాస్పిటల్ ప్రారంభోత్సవానికి హాజరైనట్లు తెలిపారు.

ఇది యూఎస్, ఫిజీ, ఇండియా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ల మధ్య బలమైన ప్రజల భాగస్వామ్యంగా ఆయన అభివర్ణించారు.

ఫిజీ ప్రధాని ఫ్రాంక్ బైనిమరామతో జరిగిన సమావేశంలో భూటోరియా మాట్లాడుతూ.

అమెరికా- ఫిజీ సంబంధాలు మరింత బలపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు.బైడెన్- హారిస్ అడ్మినిస్ట్రేషన్‌ నుంచి అన్ని రంగాల్లో సహకారం కొనసాగుతుందని భూటోరియా హామీ ఇచ్చారు.

ఆయన చెప్పిన దాని ప్రకారం చూస్తే.ఈ ఆసుపత్రి నెలకొల్పడానికి ముందు ఫిజీ, పసిఫిక్‌లో ఎక్కడా పీడియాట్రిక్ కార్డియాక్ సేవలు అందుబాటులో లేవు.

అంతేకాదు ఈ ప్రాంత వాసులకు విదేశీ చికిత్స భరించే స్తోమత లేదు.ఈ నేపథ్యంలోనే ఈ ప్రాంతంలోని వేలాది మంది పిల్లల ప్రాణాలను రక్షించే మిషన్‌ను ప్రారంభించామని భూటోరియా చెప్పారు.

ఇప్పటి వరకు సత్యసాయి సంజీవని హాస్పిటల్స్‌. భారత్, అమెరికా, ఆస్ట్రేలియా, ఒమన్‌లకు చెందిన అంతర్జాతీయ వైద్య బృందం సాయంతో ఉచిత గుండె శస్త్రచికిత్సలను చేపట్టిందని తెలిపారు.

Telugu Fiji, Fijiprime, Heart, Heart Fiji, Joe Biden, Srisatyasai-Telugu NRI

25 మిలియన్ డాలర్ల అంచనా వ్యయంతో నిర్మించిన ఈ ఆసుపత్రి ఫిజీ చరిత్రలో ఓ ఎన్జీవో చేపట్టిన పెద్ద ప్రాజెక్ట్‌లలో ఒకటి.భారత్- ఫిజీల మధ్య బలమైన సంబంధాలను నిర్మించడంలో ఇలాంటి ప్రాజెక్ట్‌లు సహాయపడతాయని ప్రధాని నరేంద్ర మోడీ ఒక ప్రత్యేక సందేశంలో పేర్కొన్నారు.అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కార్డియాక్ సర్జన్ షాన్ శెట్టి.ఈ వారాంతంలో 30 మందికి గుండెకు సంబంధించిన శస్త్రచికిత్సలు చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube