సాధారణంగా చాలా మంది ఎక్కువ దూరం ప్రయాణించడానికి ట్రైన్ అయితే కంఫర్ట్‌గా ఫీలవుతుంటారు.అయితే, రైలులో ప్రయాణం దాదాపుగా అందరికీ చాలా ఇష్టంగానే ఉంటుంది.
ఎందకంటే రైలు జర్నీలో ఎటువంటి ఇబ్బంది ఉండదు.చక్కగా ఇంట్లో కూర్చొని ఉన్నట్లు ఫీల్ ఉంటుంది.
ఇకపోతో సోషల్ మీడియాలో ట్రైన్స్‌కు సంబంధించిన వెరైటీ వీడియోస్ ఎన్నో వైరల్ అయ్యాయి.కాగా తాజాగా ఓ వెరీ డిఫరెంట్ వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది.
సదరు వైరల్ వీడియాలో ఫోర్ ట్రైన్స్ ఒకే దిశలో ఒకేసారి ఒకే వైపునకు ప్రయాణిస్తుండటం విశేషం.ఇందుకు సంబంధించిన వీడియోను ఐపీఎస్ అధికారి రూపిన్ శర్మ ట్విట్టర్ వేదికగా షేర్ చేశాడు.
‘నాలుగు రైళ్లు ఒకే దశలో ప్రయాణిస్తున్న అరుదైన వీడియో’అనే క్యాప్షన్‌తో ఐపీఎస్ ఆఫీసర్ ట్విట్టర్ హ్యాండిల్లో షేర్ అయిన వీడియో నెటిజన్లను తెగ నచ్చేసింది.
సదరు వీడియోలో ఆవిరి ఇంజిన్ రైళ్లు ఒకే మార్గంలో నాలుగు ట్రాక్‌లపై నడుస్తున్నట్లు మనం చూడొచ్చు.ఈ రైళ్లు ఇలా ఒకే డైరెక్షన్లో రావడం చూసి చాలా మంది ఆనందం వ్యక్తం చూస్తున్నారు.ఈ సుందర దృశ్యం ఎక్కడుందో అంటూ నెటిజన్లు అడుగుతున్నారు.మరి కొందరు నెటిజన్లు అయితే ఇలా నాలుగు రైళ్లు నాలుగు పట్టాలపై ఒకై వైపునకు రావడం చూస్తుంటే మనస్సుకు ఆనందం ప్లస్ ఆహ్లాదం కలుగుతున్నదని కామెంట్స్ చేస్తున్నారు.
ఈ వీడియో చూసి తనకు ఆస్ట్రేలియాలో నిర్వహించే ఆవిరి రైలు రేసులా అనిపిస్తుందని ఒక నెటిజన్ పోస్టు పెట్టారు.ఇకపోతే నాలుగు రైళ్లు ఒకే రైల్వే స్టేషన్లో ఆగిపోతే ఎలా అని కొందరు నెటిజన్లు క్వశ్చన్స్ అడుగుతున్నారు.
మరికొందరు అయితే, అద్భుతం ఈ వీడియో అంటూ కామెంట్స్ చేస్తున్నారు.గతంలో రైళ్లకు సంబంధించిన వీడియోలు వైరల్ అయినప్పటికీ ఇటువంటి రేర్ వీడియోస్ అయితే రాలేదు.ఈ నేపథ్యంలోనే ఈ వీడియోను చూసి చాలా మంది నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తూ ఈ వీడియోను ఇంకా ట్రెండ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు.