బాలీవుడ్ లో బిగ్ బాస్ హిందీ ఓటీటీ రెండో సీజన్( Bigg Boss OTT Season 2 ) తాజాగా ప్రారంభం అయ్యింది.బిగ్ బాస్ హిందీ ఓటీటీ షోకు బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్( Salman Khan ) బిగ్ హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు.
బిగ్ బాస్ ఓటీటీ ఈ కొత్త సీజన్‌లో ఇంటర్నెట్‌లో పాపులర్ అయిన చాలా మంది స్టార్లు కంటెస్టెంట్లుగా పాల్గొంటున్నారు.కాగా భారత మాజీ క్రికెటర్ ఒకప్పటి అమ్మాయిల కలల రాకుమారుడు అయిన అజయ్ జడేజా( Cricketer Ajay Jadeja ) కూడా ఈ రియాలిటీ షోలో పాల్గొనబోతున్నారు.
అయితే, ఆయన పాల్గొన్నది కంటెస్టెంట్‌గా కాదండోయ్ ప్యానలిస్ట్‌గా.
అంటే ఈ షోలో కంటెస్టెంట్లుగా పాల్గొనడానికి వచ్చిన వాళ్లను ప్రశ్నలు అడిగే ప్యానెల్‌లో అజయ్ జడేజా ఒకరు.కాగా బిగ్ బాస్ ఓటీటీ రెండో సీజన్‌లో పాల్గొనడంపై అజయ్ జడేజా ఆనందం వ్యక్తం చేశారు.షో ప్రారంభానికి ముందే అజయ్ జడేజా తాను బిగ్ బాస్ ఓటీటీలో పాల్గొంటున్నట్టు ప్రకటించారు.
ఇండియాలోనే అతిపెద్ద రియాలిటీ షోలో భాగమవుతున్నందుకు, కొత్త తరంతో ఇంటరాక్ట్ అవుతున్నందుకు నాకు నిజంగా చాలా సంతోషిస్తుసంతోషంగా ఉంది అని చెప్పుకొచ్చారు అజయ్ జడేజా.
ఈ రియాలిటీ షోను కొత్త యాంగిల్‌లో చూపించడమే లక్ష్యంగా క్రికెటర్ అయిన అజయ్ జడేజాను చేర్చుకున్నట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.కాగా క్రికెట్ ప్రియులకు అజయ్ జడేజా గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ఒకప్పుడు క్రికెట్లో అజయ్ ఆల్ రౌండర్ అన్న విషయం మనందరికీ తెలిసిందే.
కానీ ఆ తర్వాత కాలంలో ఈయన హవా చాలా వరకు తగ్గిపోయిందని చెప్పవచ్చు.కానీ చాలా కాలం తర్వాత మళ్లీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు అజయ్ జడేజా.