అల్లు అర్జున్‌ కెరీర్‌లోనే మొదటిసారి ఇలా   First Time Allu Arjun Movie Gets Flop Movie In His Career     2018-07-10   04:31:26  IST  Raghu V

మెగా హీరో అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కిన ‘నా పేరు సూర్య’ చిత్రం అట్టర్‌ ఫ్లాప్‌ అయ్యింది. వక్కంతం వంశీ దర్శకత్వంలో రూపొందిన ఆ చిత్రంలో బన్నీ చాలా ప్రత్యేకంగా కనిపించాడు. అయితే ప్రేక్షకులు మాత్రం నా పేరు సూర్య చిత్రాన్ని ఆధరించలేదు. దాంతో తన తర్వాత సినిమా విషయంలో అల్లు అర్జున్‌ చాలా ఆలోచిస్తున్నాడు. దాదాపు నాలుగు నెలలుగా బన్నీ తన తర్వాత సినిమా ఏం చేయాలా అని ఆలోచించి చివరకు విక్రమ్‌ కుమార్‌ దర్శకత్వంలో సినిమాను చేసేందుకు కమిట్‌ అయ్యాడు. బన్నీ నమ్మకంను నిలిపే విధంగా విక్రమ్‌ కుమార్‌ తన తదుపరి చిత్రాన్ని చాలా ప్రత్యేకంగా ప్లాన్‌ చేస్తున్నట్లుగా తెలుస్తోంది.

అల్లు అర్జున్‌ హీరోగా కెరీర్‌ ప్రారంభించి దశాబ్దం దాటేసింది. కాని ఇప్పటి వరకు అల్లు అర్జున్‌ డబుల్‌ రోల్‌ సినిమాలు చేయలేదు. నిన్న మొన్న వచ్చిన హీరోలు రెండు మూడు డబుల్‌ రోల్‌ చిత్రాలు చేశారు. కాని బన్నీ మాత్రం ఇప్పటి వరకు డబుల్‌ రోల్‌ కథకు ఓకే చెప్పలేదు. బన్నీకి ఆ అవకాశం రాలేదో లేకుంటే ఆయనకు నచ్చే కథ దక్కలేదో కాని ఆ అవకాశం మాత్రం బన్నీకి దక్కలేదు. అల్లు అర్జున్‌ డబుల్‌ రోల్‌ చేస్తే చూడాలని ప్రేక్షకులు భావిస్తున్నారు. అయితే బన్నీ మాత్రం ఇన్నాళ్లకు డబుల్‌ రోల్‌కు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చాడు.

చేసిన ప్రతి సినిమా చాలా విభిన్నంగా తెరకెక్కించిన దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఈ చిత్రంతో మరోసారి బన్నీకి సక్సెస్‌ను ఇవ్వాలని పట్టుదలతో ఉన్నాడు. తెలుగులో ఈ దర్శకుడు చేసిన ఇష్క్‌ మరియు హలో చిత్రాలు మంచి విజయాన్ని సొంతం చేసుకున్నాయి. తమిళంలో ఈయన ఆమద్య రూపొందించిన ‘24’ చిత్రం భారీ విజయాన్ని దక్కించుకుంది. తెలుగులో కూడా ఆ సినిమా ఆకట్టుకుంది. 24 చిత్రంలో ఏకంగా ముగ్గురు సూర్యలను చూపించిన విక్రమ్‌ కుమార్‌ మొదటి సారి అల్లు అర్జున్‌ను డబుల్‌ రోల్‌లో చూపించబోతున్నాడు.

అల్లు అర్జున్‌ రెండు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడు అనగానే సినిమాపై అంచనాలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు విక్రమ్‌ కుమార్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నాడు. త్వరలో చిత్రాన్ని సెట్స్‌పైకి తీసుకు వెళ్లి, సినిమాను వచ్చే సంవత్సరంలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ చిత్రాన్ని అల్లు అరవింద్‌ నిర్మించే అవకాశాలు కనిపిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు వెళ్లడి అయ్యే అవకాశం ఉంది.