లోకేష్ పంచ్ డైలాగులు మామూలుగా లేవుగా

లోకేష్ స్పీడు ఇప్పుడు మాములుగా లేదుగా.

గతంలో లోకేష్ ని ఇప్పటి లోకేష్ కి మాటల్లో కానీ చేతల్లో కాని ప్రతిపక్షాలని దీటుగా ఎదుర్కోవడంలో కానీ పూర్తి పట్టు సంపాదించారు.

లోకేష్ రాజకీయాల్లోకి వచ్చిన కొత్తలో లోకేష్ పై వైసీపీ నేతలు కామెంట్స్ చేసిన సందర్భాలలో లోకేష్ కి తోడుగా మంత్రులు వైసీపీ పై నిప్పులు చెరిగే వారు కానీ ఇప్పుడు సీన్ రివర్స్ అయ్యింది.లోకేష్ ఇచ్చే కౌంటర్ కి వైసీపి నేతలకి మైండ్ బ్లాక్ అవుతోందట.

లోకేష్ ఇపుడు ఏపీ ప్రభుత్వంపై కానీ టీడీపీ పార్టీపై కానీ చంద్రబాబు పై కానీ ఎవరన్నా అనుచిత వ్యాఖ్యలు చేస్తే దిమ్మతిరిగేలా కౌంటర్ వేస్తున్నారు లోకేష్.అయితే ఈ క్రమంలోనే లోకేష్ కర్నూల్ జిల్లా పర్యటనలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలపై షాకింగ్ కామెంట్స్ చేశారు.లోకేష్ పంచ్ డైలాగులు విన్న వారికి మాత్రం ఆశ్చర్యం కలుగక మానదు.

మంగళవారం కర్నూలు జిల్లాలో పర్యటించిన మంత్రి నారా లోకేష్ గూడూరు మండలం నాగలాపురం పొలాల్లో పంట కుంటలను పరిశీలించారు.అనంతరం ఉపాధి కూలీలతో మంత్రి లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు.

Advertisement

అయితే ఈ సంధర్భంలో మాట్లాడిన లోకేష్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి అభివృద్ది పుత్రుడు చంద్రబాబు అయితే అవినీతి పుత్రుడు జగన్ అని.ప్రధాని మోడీ దత్తత పుత్రుడు పవన్ కళ్యాణ్ అని మంత్రి నారా లోకేష్ వ్యాఖ్యానించారు.ఎపీని చంద్రబాబు ఎంతో అభివృద్ధి చేయాలని చూసుంటే రాజకీయ అధికారమే పరమావధిగా ఈ ముగ్గురూ ఏపీ ని ఎదగనీయకుండా తొక్కేయాలని చూస్తున్నారని మండిపడ్డారు.

ఏడాదిలో రెండున్నర లక్షల పంట కుంటలు తవ్వి చరిత్ర సృష్టించామన్నారు.ఉపాధి పని దినాలు మరో యాభై రోజులు పెంచాలని, వ్యవసాయానికి అనుసంధానం చేయాలని మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు.

కర్నూలు జిల్లా పర్యటనలో నారా లోకేష్ ప్రసంగాల్లో దూకుడు టిడిపి చర్చనీయాంశంగా మారినట్లు తెలుస్తోంది.అన్నీ తానై పార్టీలో ప్రకటించడం గడిచినరోజున సోమవారం నారా లోకేష్ కర్నూలు అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు అభ్యర్థుల్ని ప్రకటించడం.

ఈరోజు ప్రతిపక్ష నేతలపై వాగ్భాణాలు విసరడం చూస్తుంటే ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో లోకేష్ ని హైలెట్ చేయడానికి పార్టీలో ఈ పరిణామాలని తీసుకువస్తున్నారని అంటున్నారు విశ్లేషకులు.

ఏపీలో పేదల పథకాలకు బాబే అడ్డు పడుతున్నారా.. ఆ ఫిర్యాదులే ప్రజల పాలిట శాపమా?
Advertisement

తాజా వార్తలు