మహిళా ప్రపంచ క్రికెట్‌లో ఒక చరిత్ర సృష్టించిన క్రీడాకారిణి తెలుగమ్మాయి మిథాలీ రాజ్.ఈమె తన అద్భుతమైన క్రికెట్ టాలెంట్ తో మహిళా క్రికెట్ పైనే ఒక ఆసక్తిని నెలకొల్పింది అని అంటే అతిశయోక్తి కాదేమో.
అలాంటి మిథాలీ కి సంబందించి ఒక బయోపిక్ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ బయోపిక్ లో మన తాప్సి పన్ను మిథాలీ క్యారెక్టర్ చేస్తుంది.
అయితే ఈ బయోపిక్ కు సంబంధించి ఫస్ట్ లుక్ రిలీజ్ అయినట్లు తెలుస్తుంది.భారత్ క్రికెట్‌కి ఎనలేని సేవలందించిన ఆమె జీవిత నేపథ్యంలో బయోపిక్ రూపొందుతున్న ఈ వయాకామ్ 18 నిర్మాణంలో తెరకెక్కిస్తున్నారు.
ఈ చిత్రంలో మిథాలీ పాత్రలో తాప్సీ నటిస్తుంది అనడం కన్నా జీవిస్తుంది అని చెప్పాలి.ఈ చిత్ర ఫస్ట్ లుక్ లోనే తాప్సి నిజంగా మిథాలీ పాత్రలో ఒదిగిపోయింది అని చెప్పాలి.
ఈ బయోపిక్ ను రాయీస్ ఫేమ్ రాహుల్ దొలాఖియా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే.శభాష్ మిథు అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ కొద్ది సేపటి క్రితం విడుదలవ్వగా తాప్సీ మిథాలీ పాత్రలో ఒదిగిపోయి మంచి స్టైలిష్ షాట్ కొడుతున్నట్టుగా కనిపిస్తుంది.2021 మేలో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు సమాచారం.