దేశంలోకెల్లా అత్యంత పొడవైన అరటిపండును ఉత్పత్తి చేశానని ఆ రైతు చెబుతున్నాడు.దాని పరిమాణం తెలిస్తే ఎవరైనా షాక్ అవుతారు.
మధ్యప్రదేశ్‌లోని బర్వానీ జిల్లాకు చెందిన రైతు అరవింద్ జాట్ అరటి ఫార్మింగ్‌లో కొత్త టెక్నాలజీని ఉపయోగించి 14 అంగుళాల పొడవైన అరటిని ఉత్పత్తి చేశాడు.భారతదేశంలో 14 అంగుళాల పొడవైన అరటిపండును తాను ఉత్పత్తి చేశానని అతను తెలిపాడు.
ఇప్పటి వరకు ఇంత పొడవాటి అరటి ఎక్కడా పండలేదు.ఇప్పుడు గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో తన పేరు నమోదు చేయాలని ఆ రైతు విజ్ఞప్తి చేయడంతో పాటు అందుకు ప్రయత్నాలు కూడా చేస్తున్నాడు.
అరవింద్ జాట్ తాను 1985 నుంచి అరటి సాగు చేస్తున్నానని చెప్పారు.ఇంతకు ముందు అరటి దుంపలతో అరటి మొక్కలను సిద్ధం చేసి, తన పొలాల్లో నాటడం వల్ల ఖర్చు ఎక్కువ అయిందని, లాభం తక్కువ వచ్చిందని తెలిపాడు.
మధ్యప్రదేశ్‌కు ఆనుకుని ఉన్న మహారాష్ట్ర సరిహద్దు జిల్లాల్లో కొందరు రైతులు కొత్త రకం అరటిని వేసి, మంచి దిగుబడిని పొందడాన్ని అరవింద్ గమనించాడు.అక్కడికి వెళ్లి రైతులతో మాట్లాడి అరటి పండించే మెళకువలను తెలుసుకున్నాడు.
ఆ తర్వాత తానూ అదే టెక్నిక్‌తో అరటి సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు.అయితే ఆ అరటి రకం సాగు అంత సులభం కాదని, ఖర్చుతో కూడుకున్నదని చాలా నష్టం వాటిల్లుతుందని ఆ ప్రాంతానికి చెందిన కొందరు రైతులు అరవింద్‌ను నిరుత్సాహ పరిచారు.
అయినా అరవింద్ పట్టు వదలకుండా మహారాష్ట్రలోని జలగావ్ నుంచి జీ-9 రకం అరటి రకాన్ని తీసుకొచ్చి సాగు చేసి, లాభాలు పొందాడు.