బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ స్థాయి ఓ రేంజికి పెరిగింది.ఇండియన్ హీరోలలో ఎవరికీ అందనంత స్థాయికి ఎదిగాడు.
ఈ నేపథ్యంలో ఆయన వరుసబెట్టి పాన్ ఇండియన్ సినిమాలు చేస్తున్నాడు.అయితే ఇప్పటి వరకు ఆయన సినిమాలు జనాల ముందుకు రాలేదు.
అన్నీ షూటింగ్స్ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతున్నాయి.త్వరలో విడదల కాబోతున్న రాధే శ్యామ్ సినిమా కోసం జనాలు ఎంతో ఎదురు చూస్తున్నారు.
అయితే ఈ సినిమాకు సంబంధించి రిలీజ్ డేట్ ను నిర్మాతలు ఇప్పటికే అనౌన్స్ చేశారు.కానీ ఆ తర్వాత ఎలాంటి అప్ డేట్ ఇవ్వకపోవడంతో అభిమానులు మస్తు కోపంగా ఉన్నారు.
అటు ఈ సినిమాకు సంబంధించిన విడుదల సహా మిగతా వివరాలు వెంటనే వెల్లడించకపోతే.తాను సూసైడ్ చేసుకుంటానని ఓ అభిమాని యువి క్రియేషన్స్ కు లేఖ రాశాడు.
ఈ నేపథ్యంలో సదరు నిర్మాణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది.నవంబర్ 15 నుంచి ఫస్ట్ సింగిల్ విడుదల అవుతుందని వెల్లడించింది.
అయితే 15 సాయంత్రం 5 గంటలకు దీన్ని విడుదల చేస్తామని చెప్పింది.కానీ సమయం గడిచినా విడుదల చేయలేదు.
దీంతో యువి క్రియేషన్స్ ను ప్రభాస్ అభిమానులు ఓ రేంజిలో ట్రోల్ చేశారు.
అభిమానుల పోరుకు తట్టుకోలేక… ఈ సినిమా నుంచి ఓ పాటను విడుదల చేశారు.ఈ రాతలే అంటూ సాగిపోయే పాటను సోషల్ మీడియాలోకి వదిలారు.ప్రభాస్ రాధే శ్యామ్ సినిమాపై అభిమానులు ఓ రేంజిలో అంచనాలు పెట్టుకున్నారు.
కానీ తాజాగా విడుదలైన పాట చాలా చప్పగా ముందుకు సాగింది.దీంతో అభిమానులు నిరాశకు లోనయ్యారు.
ఈ పాట కోసమా ఇంతలా ఎదురు చూసింది? అంటూ పెదవి విరుస్తున్నారు.ఈ పాటతో ప్రభాస్ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇదొక్క పాటేనా.మిగతా పాటలు కూడా ఇలాగే దరిద్రంగా ఉన్నాయా? అంటూ కామెంట్లు పెడుతున్నారు.మొత్తంగా గడిచిన రెండు మూడు రోజులుగా యువి క్రియేషన్స్ ట్రోలింగ్ దెబ్బకు అల్లాడుతుంది.