పవన్ కళ్యాణ్ అంటే అభిమానులకు రోజు రోజుకు అభిమానం పెరిగి పోతుంది.ఇప్పటికే పవన్ కళ్యాణ్ పేరిట ఎన్నో మంచి పనులు చేస్తున్న అభిమానులు పవనిజం అంటూ సమాజంలో ప్రచారం చేస్తున్నారు.
ఇకపై ప్రపంచ పవనిజం డేను కూడా జరపాలని పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ నిర్ణయించారు.నేడు పవనిజం డేగా ఫ్యాన్స్ ఖరారు చేశారు.
పవన్ కళ్యాణ్ నటించిన మొదటి చిత్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’ చిత్రం విడుదలైన రోజైన ఈ రోజును ఇకపై వరల్డ్ పవనిజం డే ను సెలబ్రేట్ చేసుకోవాలని నిర్ణయించారు.
నేడు తెలుగు రాష్ట్రాలతో పాటు ప్రపంచ దేశాల్లో ఉన్న పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అంతా కూడా ఉత్సాహంగా ఈ పవనిజం డేను జరుపుకోవాలని ఫ్యాన్స్ పిలుపునిస్తున్నారు.
పవనిజం డే సందర్బంగా అనేక సేవా కార్యక్రమాలను అభిమానులు చేస్తున్నారు.ఇలా ఒక హీరోకు డేను నిర్ణయించడం అనేది చాలా అరుదు.
ఇది చాలా పవన్‌కు ఉన్న క్రేజ్ ఎలాంటిదో చెప్పడానికి.ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ‘సర్దార్ గబ్బర్‌సింగ్’ చిత్రంలో నటిస్తున్న విషయం తెల్సిందే.
భారీ అంచనాల నడుమ తెరకెక్కుతున్న ఆ చిత్రం వచ్చే సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి.
పవన్ కళ్యాణ్ అభిమానులకు వరల్డ్ పవనిజం డే శుభాకాంక్షలు.