'మజిలీ' హిట్‌తో మళ్లీ కావాలంటూ ఫ్యాన్స్‌ ఒత్తిడి చేస్తున్నారంటున్న సమంత  

Fans Asking Majili Hit Again Says Samantha-

అక్కినేని కపుల్‌ నాగచైతన్య మరియు సమంతలు అద్బుతమైన ‘మజిలీ’ని దక్కించుకున్నారు.పెళ్లి తర్వాత వీరిద్దరి కాంబోలో మూవీ కోసం ఫ్యాన్స్‌ చాలా ఆసక్తిగా ఎదురు చూశారు.ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూసినందుకు మజిలీ వంటి మంచి సినిమాను ఇచ్చి వారిని సంతృప్తి పర్చారు.

Fans Asking Majili Hit Again Says Samantha--Fans Asking Majili Hit Again Says Samantha-

పెద్ద ఎత్తున అంచనాలున్న నేపథ్యంలో ఏమాత్రం నిరాశ పర్చినా కూడా తీవ్ర విమర్శలు వచ్చేవి.కాని సినిమాకు అన్ని విధాలుగా పాజిటివ్‌ రెస్పాన్స్‌ వచ్చిన కారణంగా సినిమాకు మంచి వసూళ్లు నమోదు అవుతున్నారు.

Fans Asking Majili Hit Again Says Samantha--Fans Asking Majili Hit Again Says Samantha-

‘మజిలీ’ చిత్రం సక్సెస్‌ తర్వాత సమంత మీడియాతో మాట్లాడుతూ.తన సంతోషంకు అవదులు లేవు అంటూ చెప్పుకొచ్చింది.ఏదైనా పనిని భర్తతో కలిసి చేస్తే అది సక్సెస్‌ అయితే చాలా సంతోషం కలుగుతుంది.

అది కూడా పెళ్లి అయిన తర్వాత మొదటి సారి చేసిన పని అయితే ఆ ఆనందం రెట్టింపు ఉంటుందని నాకు ఇప్పుడు అర్థం అయ్యింది.ఆనందంతో కన్నీళ్లు వస్తున్నాయని సమంత చెప్పుకొచ్చింది.ఇంతటి ఘన విజయాన్ని ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.

మజిలీ చిత్రం తర్వాత మళ్లీ ఎప్పుడు కలిసి నటిస్తారు అంటూ అప్పుడే అభిమానులు ప్రశ్నిస్తున్నారు.వచ్చే ఏడాదికి మరో సినిమాను మీ ఇద్దరి కాంబినేషన్‌లో చూడాలనుకుంటున్నాం అంటూ ఫ్యాన్స్‌ చెబుతున్నారు.

మీ జంట సంవత్సరంకు ఒక సినిమా చేయాలని కోరుకుంటున్నాం.మీరు వరుసగా చిత్రాలు చేయాలి, అవి సక్సెస్‌ అవ్వాలి, మీకు రికార్డు రావాలంటూ సోషల్‌ మీడియాలో ఒక అభిమాని సుదీర్ఘంగా పోస్ట్‌ పెట్టాడు.దానికి స్పందించిన సమంత ఇలాంటి వారు చాలా మంది ఉన్నారు.మజిలీ విడుదలైనప్పటి నుండి మళ్లీ చైతూతో నటించాల్సిందిగా ఒత్తిడి చేస్తున్నారు.చైతూతో నటించడం నాకు చాలా ఇష్టం.అయితే అందుకు తగ్గ కథలు కావాలంటూ సమంత చెప్పుకొచ్చింది.చైతూతో తప్పకుండా మళ్లీ సినిమా ఉంటుందని మాత్రం చెప్పుకొచ్చింది.