ఎన్నికల ఫలితాలపై టెన్షన్ గా ఎదురుచూస్తున్న నేతలు! 2 గంటలకే క్లారిటీ

ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కి మరి కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది.ఇక ఎన్నికల ఫలితాల నేపధ్యంలో ప్రధాన పార్టీలైన తెలుగు దేశం, వైసీపీ, జనసేన పార్టీ అధినేతలు రాజధానికి చేరిపోయారు.

 Election Result Will Concluded Mid Day-TeluguStop.com

ఇక ఈ ఎన్నికలలో ప్రధాన ప్రత్యర్ధులుగా తెలుగు దేశం, వైసీపీ ఉన్నాయి.ఈ రెండు పార్టీలలో గెలుపు ఎవరిని వరిస్తుంది అనేది ఇప్పుడు ఆసక్తిగా మారింది.

మరో వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా ఈ ఎన్నికల ఫలితాలపై ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.తాను కోరుకున్న మార్పుకి ప్రజల నుంచి ఎంత వరకు మద్దతు లభించింది అనేది తెలుసుకోవాలనే ఆసక్తితో చూస్తున్నారు.

ఏపీలో కింగ్ మేకర్ గా జనసేన ఉంటుంది అని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు.ఏది ఏమైనా ఎన్నికల ఫలితాలు మూడు పార్టీలకి కాస్తా టెన్షన్ పెడుతున్నాయి అని చెప్పాలి.

ఎ ఒక్కరు కూడా పూర్తిగా ఫలితాలపై నమ్మకంతో లేరనే మాట వినిపిస్తుంది.ఇదిలా ఉంటే ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ఉదయం 8 గంటలకి మొదలవుతుంది.ఇక ఎన్నికల కౌంటింగ్ ప్రకారం 2 గంటలకి ఫలితం తెలిసిపోతుందని, అయితే పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు, వీవీ ప్యాట్ ల లెక్కింపు కారణంగా ఫలితం అధికారికంగా ప్రకటించడం ఆలస్యం అయ్యే అవకాశం ఉందని ఎన్నికల అధికారి కూడా స్పష్టం చేసేసారు.ఈ నేపధ్యంలో ప్రధాన పార్టీల గెలుపుపై బెట్టింగ్ లు వేసిన వారు కూడా ఎవరు గెలుస్తారు అనేది తెలుసుకోవడానికి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube