మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి తర్వాత తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధం రాసిన ప్రేమ కథ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.తెలుగు, మలయాళీ బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది.
వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాని దర్శకుడు హను చాలా కసితో చేస్తున్నాడు.
ఆయన చేసిన చివరి చిత్ర పడిపడి లేచే మనసు డిజాస్టర్ అయ్యింది.ఈ సారి ఆ సినిమా విషయంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా మరింత కేర్ ఫుల్ గా ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు.
పీరియాడిక్ జోనర్ కి ప్రస్తుతం డిమాండ్ భాగా ఉంది.ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలకి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.
ఈ నేపధ్యంలో ఇదిలా ఉంటే శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఊహించని సర్ప్రిజ్ వచ్చింది.సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది.
ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో మద్రాస్ ఆర్మీ ఆఫీసర్ లెఫ్ట్‌నెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్ నటిస్తున్నట్లు తెలిపింది ప్రేమ కోసం ఆ శ్రీ రాముడి యుద్ధం చిరస్మరణీయం.త్వరలో తన ప్రేమకావ్యంతో మన ముందుకు మా లెఫ్ట్‌నెంట్ రామ్.
చెడుపై మంచి తప్పకుండా గెలుస్తుంది అంత వరకూ సేఫ్‌గా ఉండండి అని చిత్ర యూనిట్ తెలిపింది.ప్రస్తుతం కాశ్మీర్లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు.
దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.రెగ్యులర్ ప్రేమ కథలకి ఇప్పటికే ప్రేక్షకులు అలవాటు పడిపోయారు.
మరి ఈ సినిమాలో దర్శకుడు హను ఎలాంటి ప్రేమకథని తెరపై ఆవిష్కరిస్తాడు అనేది వేచి చూడాలి.