ఆందోళన కలిగిస్తున్న కరోనా ట్రిపుల్‌ మ్యుటెంట్‌ స్ట్రెయిన్.. హెచ్చరిస్తున్న నిపుణులు.. !

గత సంవత్సరం ఇండియాలో ప్రవేశించిన కోవిడ్ ఇప్పటి వరకు తన జైత్రయాత్రను విజయవంతంగా కొనసాగిస్తుంది.ముఖ్యంగా ప్రజల జీవితాలను మార్చేది రాజకీయ నేతలే అన్న అపోహను తొలగించి తాను కూడా వారికంటే వేగంగా, దారుణంగా ప్రజల జీవితాలను కాలరాస్తానని నిరూపించింది కరోనా వైరస్.

 Corona Virus Triple Mutant Strain In India , Corona, Triple Mutant Strain, B.1.6-TeluguStop.com

ఇక ఉన్న వాడు కరోనా రావద్దని దేవుణ్ని వేడుకుంటుంటే, పేదలు మాత్రం లాక్‌డౌన్ రాకుండా, ఆకలి చావులు పెరగకుండా చూడు దేవుడా అని ప్రార్దించే స్దాయికి దిగజార్చింది ఈ మహమ్మారి.ఇకపోతే కరోనా మొదలైంది సింగిల్ గానే కానీ ఈ మధ్యలో ఎన్నో మార్పులు చేర్పులు చేసుకుంటూ లెటెస్ట్ వెర్షన్‌తో ముప్పతిప్పలు పెడుతుంది.

ఇదిలా ఉండగా ఇప్పటికే కరోనా సెకండ్ వేవ్ సృష్టిస్తున్న విధ్వంసాన్ని చూస్తున్న ప్రజలకు మరో షాకింగ్ న్యూస్ చెబుతున్నారు నిపుణులు.అదేమంటే.

దేశంలో మూడుసార్లు ఉత్పరివర్తనం చెందిన వైరస్‌ వెలుగుచూడటం ఆందోళన కలిగిస్తున్నది.

ట్రిపుల్‌ మ్యుటెంట్‌ స్ట్రెయిన్‌ కు చెందిన బీ.1.617 రకం స్ట్రెయిన్‌ను మహారాష్ట్ర, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాల్లో నిపుణులు తెలిపారు.దీని వల్ల దేశంలో మరిన్ని కేసులు పెరిగే ప్రమాదమున్నదని, ముఖ్యంగా బెంగాల్‌ హాట్‌స్పాట్‌గా మారనున్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube