లెఫ్ట్ నెంట్ రామ్ తో కాశ్మీర్ లో బిజీగా ఉన్న దర్శకుడు హను రాఘవపూడి

మలయాళీ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ మహానటి తర్వాత తెలుగులో హను రాఘవపూడి దర్శకత్వంలో యుద్ధం రాసిన ప్రేమ కథ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.తెలుగు, మలయాళీ బాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమా పీరియాడిక్ లవ్ డ్రామాగా తెరకెక్కుతుంది.

 Dulquer Salmaans First Glimpse As Lieutenant Ram Revealed, Hanu Raghavapudi, Swa-TeluguStop.com

వైజయంతీ మూవీస్ బ్యానర్ లో అశ్వినీదత్ ఈ సినిమాని నిర్మిస్తున్నారు.ఇదిలా ఉంటే ఈ సినిమాని దర్శకుడు హను చాలా కసితో చేస్తున్నాడు.

ఆయన చేసిన చివరి చిత్ర పడిపడి లేచే మనసు డిజాస్టర్ అయ్యింది.ఈ సారి ఆ సినిమా విషయంలో జరిగిన తప్పులు రిపీట్ కాకుండా మరింత కేర్ ఫుల్ గా ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఈ సినిమాని ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నాడు.

పీరియాడిక్ జోనర్ కి ప్రస్తుతం డిమాండ్ భాగా ఉంది.ప్రేక్షకులు కూడా ఇలాంటి కథలకి ఎక్కువగా కనెక్ట్ అవుతున్నారు.

ఈ నేపధ్యంలో ఇదిలా ఉంటే శ్రీరామనవమి సందర్భంగా ఈ సినిమా నుంచి ఊహించని సర్ప్రిజ్ వచ్చింది.సినిమాకి సంబంధించి ఫస్ట్ గ్లింప్స్ ని చిత్ర యూనిట్ రిలీజ్ చేసి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపింది.

ఫస్ట్ గ్లింప్స్ వీడియోలో మద్రాస్‌ ఆర్మీ ఆఫీసర్‌ లెఫ్ట్‌నెంట్‌ రామ్‌గా దుల్కర్‌ సల్మాన్‌ నటిస్తున్నట్లు తెలిపింది ప్రేమ కోసం ఆ శ్రీ రాముడి యుద్ధం చిరస్మరణీయం.త్వరలో తన ప్రేమకావ్యంతో మన ముందుకు మా లెఫ్ట్‌నెంట్‌ రామ్‌.

చెడుపై మంచి తప్పకుండా గెలుస్తుంది అంత వరకూ సేఫ్‌గా ఉండండి అని చిత్ర యూనిట్‌ తెలిపింది.ప్రస్తుతం కాశ్మీర్‌లో చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రానికి విశాల్‌ చంద్రశేఖర్‌ సంగీతం అందిస్తున్నారు.

దివాకర్‌ మణి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు.రెగ్యులర్ ప్రేమ కథలకి ఇప్పటికే ప్రేక్షకులు అలవాటు పడిపోయారు.

మరి ఈ సినిమాలో దర్శకుడు హను ఎలాంటి ప్రేమకథని తెరపై ఆవిష్కరిస్తాడు అనేది వేచి చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube