కాంగ్రెస్ తోనే షర్మిలకు ఇబ్బందులు ?

ఎన్నో ఆశలతో పార్టీ పెట్టినా, ఆ పార్టీని జనాల్లోకి తీసుకెళ్లి పెద్ద ఎత్తున నాయకులను చేర్చుకునే విషయంలో షర్మిల పార్టీ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటోంది.మొదట్లో చేరికలు కాస్త ఉత్సాహ పరిచినా, ఆ తర్వాత మాత్రం నిరుత్సాహాన్ని కల్గించాయి.

 Due To The Congress In Telangana Sharmilas Party Is In-trouble Ys Sharmila, Tela-TeluguStop.com

పార్టీలో చేరిన ఒక్కో నేత బయటికి వెళ్లి పోతున్న తీరు పార్టీకి భవిష్యత్తు లేదనే అభిప్రాయాన్ని పార్టీని వీడిన వారు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు.ఇవే కాకుండా ఇతర పార్టీల నుంచి నాయకులు వలస వచ్చే పరిస్థితి లేకపోవడం ,ఎన్ని రకాల ఆందోళనలు, నిరసన దీక్షలు చేపట్టినా, పెద్దగా ఫోకస్ లభించక పోవడం ఇవన్నీ షర్మిల పార్టీకి ఇబ్బందికరంగా మారాయి.

షర్మిల వైఎస్సార్ తెలంగాణ పార్టీ స్థాపించిన సమయంలో కాంగ్రెస్ ప్రభావం తెలంగాణలో అంతంత మాత్రంగానే ఉండేది.టిఆర్ఎస్ తర్వాత బిజెపి పరిస్థితి మెరుగ్గా ఉండేది .ఈ క్రమంలోనే టిఆర్ఎస్ బిజెపిల లో ఇమాడ లేనివారు ఆ పార్టీలో చేరేందుకు ఆసక్తి చూపించేవారు.

        మూడో ప్రత్యామ్నాయంగా తమ పార్టీలో చేరుతారని ఏదోలా తెలంగాణలో బలం పెంచుకుని అధికారంలోకి రాకపోయినా, ఎవరైనా అధికారంలోకి రావాలంటే తప్పనిసరిగా తన మద్దతు అవసరమయ్యేలా చేసుకునేందుకు షర్మిల ముందుగానే ప్లాన్ చేసుకుంటారు.

అయితే అనూహ్యంగా l కాంగ్రెస్ బలపడింది.బిజెపి సైతం తెలంగాణలో అసలు సిసలైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తోంది.కొత్తగా పిసిసి అధ్యక్ష బాధ్యతలు రేవంత్ రెడ్డికి ఇవ్వడంతో ఆ పార్టీ లో ఉత్సాహం వచ్చింది .తెలంగాణలో అధికారంలోకి కాంగ్రెస్ తప్పకుండా వస్తుంది అనే నమ్మకం కార్యకర్తలలోనే  కాకుండా కాంగ్రెస్ అధిష్టానం కి కలిగింది.దీనికి తగ్గట్లుగానే రేవంత్ రెడ్డి నిత్యం ఏదో ఒక అంశం తో జనాలు లోనే ఉంటూ టిఆర్ఎస్ ప్రభుత్వం పై విమర్శలు చేస్తున్నారు.

 

Telugu Jagan, Pcc, Revanth Reddy, Telangana, Tpcc, Ys Sharmila, Ys Vijayamma-Telకాంగ్రెస్ బాగా బలపడగా, షర్మిల పార్టీకి ఇదే ఇబ్బందికరంగా మారింది.బిజెపి టిఆర్ఎస్ లో ఇమడ లేని నాయకులు ఇప్పుడు తమ పార్టీని కాదని కాంగ్రెస్ వైపు చూస్తూ ఉండడం, రేవంత్ రెడ్డి నాయకత్వంపై నమ్మకం పెరగడం ఇవన్నీ వై ఎస్ ఆర్ టీపీకి డ్యామేజ్ చేస్తున్నాయి

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube