ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ మాత్రమే సరిపోదు.. చిన్మయి కామెంట్ల వెనుక అర్థమిదేనా?

చైతన్య సమంత విడిపోయిన తర్వాత పలువురు సెలబ్రిటీలు పెట్టిన పోస్టుల గురించి సైతం సోషల్ మీడియా వేదికగా చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే.సమంతకు సన్నిహితులైన వ్యక్తుల్లో సింగర్ చిన్మయి కూడా ఒకరు.

 Dubbing Artist Chinmayi Shocking Post About Chaitanya Samantha Relationship Deta-TeluguStop.com

చిన్మయి వాయిస్ వల్లే సమంతకు ఊహించని స్థాయిలో గుర్తింపు దక్కిందని చాలామంది భావిస్తారు.సమంత బహిరంగంగా చెప్పకపోయినా ఆమె సన్నిహితులకు సమంత విడిపోవటానికి గల కారణాలు తెలిసే ఉంటాయి.

సమంత ప్రాణ స్నేహితురాలు అయిన చిన్మయి చైతన్య సమంత విడిపోతున్నట్టు ప్రకటన చేయడానికి కొన్ని గంటల ముందు పెళ్లికి ఇద్దరు వ్యక్తుల మధ్య ప్రేమ మాత్రమే సరిపోదని వెల్లడించారు.పెళ్లి చేసుకోవాలని ఆలోచన వస్తే జీవిత భాగస్వామి విషయంలో మీకు ఉండే అంచనాలను ముందుగానే చర్చించాలని చిన్మయి పేర్కొన్నారు.

జీవితానికి ప్రేమ మాత్రమే సరిపోదంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పెళ్లి చేసుకోవడానికి ముందే ఆదాయం, అప్పుల గురించి అభిరుచులు, మతం, ఖర్చుల గురించి ఇష్టాయిష్టాల గురించి, పిల్లల పెంపకం విషయంలో కుటుంబంలో ఉండే ఆరోగ్య పరిస్థితుల గురించి, మానసిక ఆరోగ్యం గురించి చర్చించాలని చిన్మయి వెల్లడించారు.చిన్మయి షేర్ చేసిన సందేశం చైత్యన్య సమంతలను ఉద్దేశించి చేసిన సందేశమే అని అర్థమవుతున్నా ఆ మెసేజ్ ద్వారా సమంత చైతన్య ఎందుకు విడిపోయారో క్లారిటీ రావడం లేదు.

భవిష్యత్తులోనైనా సమంత చైతన్య విడిపోవడానికి అసలు కారణాలు వెలుగులోకి వస్తాయేమో చూడాల్సి ఉంది.విడాకుల ప్రకటన తర్వాత సమంత షూట్స్ లో పాల్గొంటూ బిజీగా ఉన్నారు.సమంత చైతన్య కెరీర్ ను ఏ విధంగా ప్లాన్ చేసుకుంటారో చూడాల్సి ఉంది.

చైతన్య సమంత మళ్లీ కలిసి నటించే అవకాశాలు అయితే దాదాపుగా లేవని తెలుస్తోంది.దర్శకనిర్మాతలు ఆ దిశగా ప్రయత్నాలు చేసినా సమంత నాగచైతన్య ఒప్పుకునే అవకాశాలు అయితే లేవు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube