డ్రైవ్ ఇన్ సినిమా స్టైల్లో .. డ్రైవ్ ఇన్ మ్యారేజ్: ఎన్ఆర్ఐ జంట వెరైటీ పెళ్లి

కరోనా మహమ్మారి సరికొత్త ఆలోచనలకు రూపునిస్తోంది.కొత్త ఆలోచనలు.

 Indian Origin Couple Drive-in Wedding Bypasses Guest Limit In Uk, Drive-in Weddi-TeluguStop.com

వినూత్న పద్ధతులకు మనుషుల్ని క్రమంగా అలవాటు చేస్తోంది.తినే తిండి నుంచి ఆస్వాదించే వినోదం వరకూ అన్నీ మార్పులే.

ఎన్నడూ ఊహించని మార్పులే.లాక్ డౌన్ తో ఇళ్లకే పరిమితం అయిపోయిన జనం ఎంటైర్ టైన్ మెంట్ కు పూర్తిగా దూరమైపోయారు.

ఎంటైర్ టైన్మెంట్అంటే ముందుగా గుర్తుకొచ్చేది సినిమా.ఇంట్లో ఎంత పెద్ద టీవీ ఉన్నా ఆఖరికి హోం థియేటర్ ఉన్నా సరే.సినిమా థియేటర్ కు వెళ్లి చూడటంలో ఆ కిక్కే వేరుగా ఉంటుంది.

కానీ లాక్ డౌన్ తో థియేటర్స్ అన్నీ 5 నెలలుగా సినిమాలు లేక జనం కూడా ఎప్పుడు తెరుచుకుంటాయా అని ఆసక్తిగా చూస్తున్నారు.

ఎంతకీ తగ్గని కరోనా మహమ్మారి వల్ల థియేటర్స్ తెరవటానికే భయపడుతోంది ప్రభుత్వం.ఈ క్రమంలో థియేటర్ల యజామాన్యాలకు వచ్చిన ఆలోచనే ‘‘ డ్రైవ్ ఇన్ సినిమా ’’. సినిమా చూడాలనుకునే వారు కారులోనే కూర్చొని దర్జాగా చూసేయవచ్చు.ప్రస్తుత విపత్కర పరిస్ధితుల్లో ‘డ్రైవ్ ఇన్ సినిమా’ను జనాలు ఎంజాయ్ చేస్తున్నారు.

Telugu Corona Effect, Drive, Indian Origin, Indianorigin, Lockdown-Telugu NRI

అచ్చం ఇదే తరహా విధానాన్ని పెళ్లిలోనూ ఫాలో అయ్యింది ఓ ఎన్ఆర్ఐ జంట.కోవిడ్ కారణంగా వివాహ వేడుకలు జరుపుకునేందుకు పరిమిత సంఖ్యలోనే బంధుమిత్రులకు ప్రభుత్వం అనుమతినిస్తోంది.దీంతో బ్రిటన్‌లో స్థిరపడిన భారత సంతతి జంట రోమా పోపట్, వీనల్ పటేల్‌లు తమ వివాహాన్ని గ్రాండ్‌గా ప్లాన్ చేశారు.కానీ ప్రస్తుత నిబంధనల ప్రకారం యూకేలో పెళ్లి వేడుకకు 15 మందికి మించి హాజరు కాకూడదు.

కానీ రోమా దంపతులకు తమ పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులు రావాలి.కోవిడ్ నిబంధనలు సైతం అమలు కావాలని భావించారు.అలా వీరికి వచ్చిన ఆలోచనే.‘‘ డ్రైవ్ ఇన్ మ్యారేజ్‌.”

వెంటనే తమకు వచ్చిన ఐడియాని ఇద్దరూ తమ తమ కుటుంబసభ్యులకు తెలియజేశారు.వారికి కూడా ఇది ఆమోదయోగ్యంగా అనిపించడంతో చకచకా ఏర్పాట్లు చేశారు.

బ్రాక్టెడ్ పార్క్‌లో 500 ఎకరాల విస్తీర్ణం గల మైదానంలో శుక్రవారం రోమా- వీనల్‌ల వివాహం జరిగింది.దీనికి హాజరైన సుమారు 250 మంది అతిథులు తమ కార్లలో కూర్చొనే పెళ్లిని తిలకించారు.

ఇందు కోసం ఓ పెద్ద తెరను ఏర్పాటు చేశారు.హిందూ సంప్రదాయం ప్రకారం 4 గంటల పాటు వీరి వివాహం జరిగింది.

పెళ్లి ముగిసిన తర్వాత కొత్త జంట గోల్ఫ్ బగ్గీలో తిరుగుతూ అతిథులను పలకరించింది.ఈ వివాహం తమకు కొత్త అనుభూతిని ఇస్తోందని, అంతేకాకుండా ఈ పెళ్లికి హాజరైన అతిథులు సైతం దీనిని తమ జీవితాంతం గుర్తు పెట్టుకుంటారని రోమా దంపతులు ఆకాంక్షించారు.

అన్నట్లు వివాహ విందును సైతం అతిథులు తమ కార్లలోనే ఆరగించారు.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube