సూపర్ స్టార్ కృష్ణ.ఈయన పరిచయం గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
ఒకప్పుడు తెలుగు సినీ ఇండస్ట్రీని సింగిల్ హ్యాండ్ తో ఓ ఊపు ఊపారు.అటువంటి హీరో ఈరోజు మన దగ్గర లేరని తెలియటంతో ఆయన అభిమానులతో పాటు తెలుగు సినీ ఇండస్ట్రీ మొత్తం మూగబోయింది.
దాదాపు 345 సినిమాలలో నటించి ఎవరు తెచ్చుకోలేనంత గుర్తింపును ఆయన సొంతం చేసుకున్నారు.ఒక అప్పట్లో ఈయన సినిమాలు వచ్చాయంటే చాలు అప్పటి ప్రేక్షకులు ఈయన సినిమా చూడకుండా అసలు ఉండలేరని చెప్పవచ్చు.
ఈయనతో అప్పట్లో అందరు హీరోయిన్స్ నటించారని చెప్పవచ్చు.
పైగా చాలామంది హీరోయిన్లు ఈయనతో కేవలం ఒక్క సినిమాతో సరిపెట్టుకోలేదు.
చాలావరకు పదుల సంఖ్యలలో ఆయన సరసన నటించారు.ముఖ్యంగా ఆయనతో కొంతమంది హీరోయిన్లు చాలా సినిమాలలో నటించి రికార్డు సొంతం చేసుకున్నారు.
ఇంతకు ఆ హీరోయిన్లు ఎవరంటే.
ఆయన భార్య విజయనిర్మల.
ఈమె కృష్ణతో దాదాపు 40 కి పైగా సినిమాలలో నటించింది.ఇక ఈమె తర్వాత అంతే అరుదైన గుర్తింపు తెచ్చుకున్న నటి జయప్రద.
ఇక జయప్రద కృష్ణతో 40 సినిమాలలో జోడిగా నటించింది.ఇక వీరిద్దరే కాకుండా శ్రీదేవి కూడా కృష్ణ తో చాలా సినిమాలలో నటించింది.
మరో నటి రాధ కూడా ఆయనతో చాలా సినిమాలలో జత కట్టింది.
ఇక కృష్ణ సరసన వీళ్లే కాకుండా మరి కొంతమంది నటీమణులు కూడా నటించక అందులో సుకన్య, సంధ్యారాణి, జయలలిత, వాణిశ్రీ, రాజశ్రీ, జమున, కాంచన, శారద, భారతి, జ్యోతిలక్ష్మి, విజయశాంతి, అంబిక, భానుప్రియ, రంభ, రోజా, సౌందర్య, రమ్యకృష్ణ అలా ఆయన సరసన రెండు తరాల హీరోయిన్లు నటించి మంచి సక్సెస్ లు అందుకున్నారు.
ఈ హీరోయిన్ లతా కేవలం ఒక్క సినిమాతో సరి పెట్టుకోలేదని చెప్పవచ్చు.ఈయనతో అవకాశాలు వస్తే మాత్రం అస్సలు వదులుకోలేరు ఈ హీరోయిన్లు.
ఇక కృష్ణ వయసు మీద పడటంతో ఆ తర్వాత హీరో హీరోయిన్ల తండ్రి పాత్రలలో కూడా నటించారు.ఇక ఈయన కెరీర్ కు మలుపు తిప్పిన సినిమాలు చాలా ఉన్నాయి అని చెప్పొచ్చు.
ముఖ్యంగా ఆయన భార్యతో నటించిన సినిమాలలో చాలా వరకు మంచి సక్సెస్ లు అందుకొని ఆమెకు కూడా మంచి హిట్ టాకు అందించాడు.ఇక ఇదంతా పక్కన పెడితే.ఈయన కొన్ని రోజుల నుండి అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సంగతి తెలిసిందే.దీంతో నిన్న అనగా నవంబర్ 14న ఆయన పరిస్థితి విషమించడంతో వెంటనే ఆసుపత్రికి తరలించారు.
దీంతో ఆయన పరిస్థితి ఈరోజు ఉదయం మరింత తీవ్రంగా మారడంతో ఈరోజు ఉదయాన్నే ఆయన మరణించారు.ప్రస్తుతం ఈయన మరణంను సినీ ఇండస్ట్రీ తట్టుకోలేక పోతుంది.
వరుస మరణాలతో ఘట్టమనేని కుటుంబం మాత్రం తీవ్రమైన విషాదంలో మునిగింది.