సినిమా ఇండస్ట్రీలో ఎదగాలని చాలామంది ఉన్న ఊరిని కన్నవారిని అందరిని వదిలేసి వస్తారు అలా వచ్చిన వారిలో కొందరు సక్సెస్ అయితే చాలామంది ఇంటికి వెళ్లిపోతారు.ఇండస్ట్రీ అంటే ఇష్టం లేని వారు ఉండరు ప్రతి 100 మందిలో 100 మందికి ఇష్టం ఉంటుంది కానీ 100 మందిలో ఇక్కడ నిలబడేది మాత్రం ఐదుగురు అని చెప్పాలి.
అలాంటి ఇండస్ట్రీలో ఏ బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చి ఇక్కడ సెటిల్ అయిన ఆర్టిస్ట్ లలో అప్పట్లో ఎన్టీఆర్, నాగేశ్వర రావు గారి లాంటి వారైతే ఆ తర్వాత వచ్చిన వాళ్లు మెగాస్టార్ చిరంజీవి గారు కూడా చాలా కష్టపడి తనకు తాను నిరూపించుకుంటూ ఎవరిమీద ఆధారపడకుండా ఇండస్ట్రీని ఒక ఊపు ఊపేసిన మనిషి చిరంజీవి.అలాంటి చిరంజీవి ఇన్స్పిరేషన్ తో చాలామంది ఇండస్ట్రీకి వచ్చి ఏదో ఒక క్రాఫ్ట్ లో సెటిలైన వాళ్ళు చాలామంది ఉన్నారు.
అయితే మనం ముఖ్యంగా రైటర్, డైరెక్టర్, నటుడు అయిన పోసాని కృష్ణ మురళి గారి గురించి తెలుసుకుందాం.
ఆయన చదువు ముగించుకుని చెన్నై వెళ్లి అక్కడ పరుచూరి బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ రైటర్ గా చేరి చాలా సినిమాలకు అసిస్టెంట్ రైటర్ గా పని చేశాడు ఆ తర్వాత గాయం లాంటి సినిమాతో ఇండస్ట్రీలో రైటర్ గా మారి మంచి గుర్తింపు సాధించాడు.
అప్పట్లో చాలా సినిమాలకి కథ మాటలు రాసి తనదైన మార్కుతో ఇండస్ట్రీలో టాప్ రైటర్ గా గుర్తింపు పొందాడు.రైటర్ గా గోకులంలో సీత, పవిత్ర బంధం, పెళ్లి చేసుకుందాం, శివయ్య లాంటి చాలా హిట్ సినిమాలకు పని చేశారు.
పోసాని కృష్ణ మురళి రైటర్ గా చేస్తూనే కొన్ని సినిమాలకి డైరెక్షన్ కూడా చేశాడు.ఆయన డైరెక్షన్లో వచ్చిన సూపర్ హిట్ సినిమా ఆపరేషన్ దుర్యోధన శ్రీకాంత్ హీరోగా వచ్చిన ఈ సినిమా అప్పుడు ఉన్న రాజకీయ పరిస్థితులను ఆధారంగా చేసుకొని తీసిన సినిమా.
రాజావారి చేపల చెరువు అనే సినిమా పేరుతో మన రాష్ట్రంలో రాజకీయ దోపిడి ఎలా జరుగుతుంది అనేది మన కళ్ళకు కట్టినట్టుగా చూపించారు.ఆ తర్వాత కూడా పోసాని గారు కొన్ని సినిమాలు డైరెక్ట్ చేశారు.
అలాగే కొన్ని సినిమాల్లో కూడా నటించారు.రామ్ చరణ్ హీరోగా వివి వినాయక్ డైరెక్షన్లో వచ్చిన నాయక్ సినిమాలో పోసాని గారు చేసిన కామెడీ కి మంచి గుర్తింపు వచ్చింది.
పోసాని గారికి అవార్డ్స్ కూడా వచ్చాయి.
ఆ తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా నటించాడు.ఆయన చేసిన సినిమాల్లో అతడు, నాయక్, ఖైదీ నెంబర్ 150,డీజే,పవర్, ఆగడు, లోఫర్, ఇజం, టెంపర్ లాంటి చాలా సినిమాలున్నాయి.ప్రస్తుతం ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లు గా కొనసాగుతున్న త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ లాంటి దర్శకులు మొదట్లో పోసాని కృష్ణమురళి దగ్గరే అసిస్టెంట్ రైటర్ గా పని చేశారు.
ఆ తర్వాత వాళ్ళు చాలా సినిమాలకు రైటర్ గా చేసి డైరెక్టర్ గా మారారు.పోసాని కృష్ణ మురళికి కొరటాల శివ మేనల్లుడు అవుతాడు.
అయితే పోసాని గారి తో పాటు వాళ్ళ అబ్బాయి కూడా ఇండస్ట్రీలోనే కొనసాగుతున్నాడు ఆయన పేరు ప్రజ్వల్.లాస్ ఏంజిల్స్ లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ కి సంబంధించిన కోచింగ్ తీసుకుని వచ్చాక ఇంట్లోనే కూర్చుని స్టోరీ రాసుకుంటున్న ప్రజ్వల్ నీ చూసి పోసాని గారు కొరటాల శివ దగ్గర జాయిన్ అవమని చెప్పారు దాంతో ప్రజ్వల్ కొరటాల శివ దగ్గర భరత్ అనే నేను సినిమాకి అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేశాడు ప్రజ్వల్ కి హీరో మహేష్ బాబు అంటే చాలా ఇష్టం.ప్రజ్వల్ మంత్రిగారు మాటిచ్చారు అనే ఒక సినిమాకి డైరెక్షన్ కూడా చేశారు అయితే ప్రజ్వల్ పోసాని గారిలాగా రైటర్ గా, డైరెక్టర్ గా రాణిస్తాడో లేదో చూడాలి.