Ravikula Raghurama : క్రేజీ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా ‘రవికుల రఘురామ’ మూవీ సాంగ్ లాంచ్ 

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ'( Ravikula Raghurama ). సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో.

 Director Parasuram Launched Chandhamame Song From Ravikula Raghurama Film Direc-TeluguStop.com

ట్యాలెంటెడ్ డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. యువ హీరో గౌతమ్ సాగి( Gowtam Sagi ), అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు.

మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు.డైరెక్టర్ చంద్రశేఖర్( Director Chandrashekhar Kanuri ) తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పోస్తున్నారు.

అలాగే హీరో హీరోయిన్లు కూడా మంచి పెర్ఫామెన్స్ అందిస్తున్నారు. 

వీరందరితో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందిస్తున్నారు.తన సంగీతాన్ని ఈ చిత్రానికి ఒక సోల్ గా మార్చేస్తున్నారు.తాజాగా ఈ చిత్రం నుంచి ‘చందమామే'( Chandhamame ) అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ రిలీజ్ అయింది.

ఈ లిరికల్ వీడియో క్రేజీ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదుగా లాంచ్ కావడం విశేషం. 

డైరెక్టర్ పరశురామ్( Director Parasuram ) ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ని అభినందించారు.చందమామే సాంగ్ వింటుంటే చాలా ప్రామిసింగ్ గా అనిపిస్తోంది.లిరిక్స్, ట్యూన్ ఎంతో అందంగా వినసొంపుగా ఉన్నాయి.

ఈ పాట ఆకట్టుకోవడమే కాదు సినిమాపై కూడా ఆసక్తిని పెంచేలా ఉంది.ఈ సాంగ్ ఆకట్టుకోవడంతో రవికుల రఘురామ చిత్ర రిలీజ్ కోసం ఆడియన్స్ ఎదురుచూస్తారని చెప్పడంలో సందేహం లేదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube