టాలీవుడ్ ప్రముఖ నిర్మాతలలో ఒకరైన దిల్ రాజుకు సంక్రాంతి పండుగ సమయంలో కోలుకోలేని దెబ్బ తగిలినా రాబోయే రోజుల్లో మాత్రం హవా కొనసాగేలా ఆయన ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది.శాకుంతలం సినిమాను ఫిబ్రవరి 17వ తేదీన విడుదల చేస్తున్నట్టు ప్రకటించి ఇతర నిర్మాతలకు షాకిచ్చిన దిల్ రాజు ఆ సినిమాతో ఇతర నిర్మాతలను దారిలోకి తెచ్చుకున్నారని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది.
శివరాత్రి కానుకగా శాకుంతలం సినిమా రిలీజ్ డేట్ ను ప్రకటించడంతో అదే సమయంలో సినిమాలను విడుదల చేస్తున్న వినరో భాగ్యము విష్ణు కథ, సర్ సినిమాల నిర్మాతలు టెన్షన్ పడ్డారు.అయితే హారిక హాసిని నిర్మాతలు దిల్ రాజు మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం బుట్టబొమ్మ, సర్, మహేష్ త్రివిక్రమ్ కాంబో మూవీ నైజాం హక్కులు దిల్ రాజు దక్కించుకున్నారు.
ఫలితంగా శాకుంతలం మూవీ రిలీజ్ డేట్ మారింది.

ఈ సినిమాల హక్కులతో పాటు రామ్ బోయపాటి కాంబో మూవీ హక్కులు, చైతన్య కస్టడీ మూవీ హక్కులు దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి.బాలయ్య అనిల్ కాంబో మూవీ హక్కులు కూడా దిల్ రాజు చేతిలోనే ఉన్నాయి.నాని దసరా మూవీ తెలుగు రాష్ట్రాల హక్కులను దిల్ రాజు కొనుగోలు చేశారు.
నైజాంలో దిల్ రాజు హవా ఊహించని రేంజ్ లో ఉండటం గమనార్హం.

గుణశేఖర్ శాకుంతలం సినిమా ఇప్పటికే రెండుసార్లు వాయిదా పడింది.శాకుంతలం సినిమా వాయిదా పడటం వల్ల ఈ సినిమాకు భారీ నష్టమని చెప్పవచ్చు.ఈ సినిమా ఎప్పుడు రిలీజవుతుందో క్లారిటీ లేకపోవడంతో ఫ్యాన్స్ టెన్షన్ పడుతున్నారు.
దిల్ రాజు ప్లానింగ్ వేరే లెవెల్ లో ఉందని ఆయన నిర్మాతగా మరిన్ని సంచలన విజయాలను సొంతం చేసుకోవడం గ్యారంటీ అని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
