ఇంద్రప్రస్థం చూపిస్తోన్న ప్రస్థానం దర్శకుడు

బాలీవుడ్‌లో తెరకెక్కిన ప్రస్థానం< చిత్రంతో యావత్ దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్న దర్శకుడు దేవా కట్టా, తొలుత టాలీవుడ్‌లో వరుస చిత్రాలతో దూసుకుపోయిన సంగతి తెలిసిందే.ప్రస్థానం చిత్రాన్ని తొలుత తెలుగులో తెరకెక్కించి అదిరిపోయే గుర్తింపును సాధించిన ఈ డైరెక్టర్ ఆ తరువాత చెప్పుకోదగ్గ హిట్ అందుకోలేకపోయాడు.

 Deva Katta New Film Title Indraprastham, Deva Katta, Indraprastham, Chandrababu-TeluguStop.com

అయితే తాజాగా దేవా కట్టా టాలీవుడ్‌లో ఓ వైవిధ్యమైన చిత్రాన్ని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు.

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, చంద్రబాబు నాయుడుల మధ్య ఉన్న స్నేహం-వైరానికి సంబంధించిన అంశాలతో ఓ సినిమాను ప్లాన్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్.

కాగా ఈ సినిమాను అఫీషియల్‌గా అనౌన్స్ చేశాడు ఈ దర్శకుడు.ఈ సినిమాకు ‘ఇంద్రప్రస్థం’ అనే ఆసక్తికరమైన టైటిల్‌ను చిత్ర యూనిట్ ప్రకటించారు.ఈ టైటిల్ చిత్ర వర్గాలతో పాటు ప్రేక్షకుల దృష్టిని ఆకట్టుకుంది.ఇద్దరు నాయకులకు సంబంధించిన షేడ్స్‌తో ఈ సినిమా ఎలా ఉండబోతుందా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

ఇక ఈ సినిమాలో నటీనటులు ఎవరనే విషయాన్ని త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది.కాగా ఈ సినిమాను దేవా కట్టా చాలా ప్రెస్టీజియస్‌గా తీసుకున్నట్లు చిత్ర వర్గాల టాక్.

ఇక ఈ సినిమాను మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో తెరకెక్కిస్తున్న సినిమా తరువాత ప్రారంభించేందుకు దేవా కట్టా రెడీ అవుతున్నాడు.మర ఈ సినిమా ఎలాంటి వివాదాలను, ఫలితాన్ని సాధిస్తుందో తెలియాలంటే మాత్రం ఈ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube