ఆహా కోసం మెగాస్టార్‌తో సంప్రదింపులు

ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌ ప్రారంభించిన ఆహా ఓటీటీ కోసం భారీ నిర్మాతలు మరియు దర్శకులు రంగంలోకి దిగుతున్నారు.ఇప్పటికే ముగ్గురు ప్రముఖ దర్శకులు వెబ్‌ సిరీస్‌ల మేకింగ్‌లపై దృష్టి పెట్టారు.

 Discussions With Mega Star For Aha, Allu Aravindh, Ott, Aha, Chiranjeevi, Web Se-TeluguStop.com

ఆ వెబ్‌ సిరీస్‌లు ఆహాలో ఒకటి రెండు నెలల్లో స్ట్రీమింగ్‌ అయ్యే అవకాశం ఉంది.ప్రముఖ దర్శకులతో ఆహా చేపట్టిన వెబ్‌ సిరీస్‌లు ఖచ్చితంగా సూపర్‌ హిట్‌ అయ్యి ఆహాకు మంచి పేరు తీసుకు వస్తాయనే నమ్మకంతో అంతా ఉన్నారు.

ఆహా వెబ్‌ సిరీస్‌ కోసం పలువురు హీరోలు మరియు హీరోయిన్స్‌ కూడా పని చేయబోతున్నారట.ఈ విషయాన్ని స్వయంగా అల్లు అరవింద్‌ ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు.

మెగాస్టార్‌ చిరంజీవిని కూడా ఆహాలో భాగస్వామి చేసి ఆహా ప్రేక్షకులకు ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇవ్వాలని ప్రయత్నాలు చేస్తున్నట్లుగా అల్లు అరవింద్‌ ప్రకటించాడు.చిరంజీవితో వెబ్‌ సిరీస్‌ లేదా ఒక షో లాంటిది చేయాలనే ఉద్దేశ్యంతో ఆయన్ను సంప్రదించారట.

ఇంకా ఈ విషయమై తుది నిర్ణయం కాని ఎలాంటి ప్లాన్స్‌ కాని చేయలేదు.కాని ఆహా కోసం చిరంజీవి వర్క్‌ చేసే ఉద్దేశ్యం ఉండా లేదా అనే విషయాన్ని మాత్రం చర్చించినట్లుగా తెలుస్తోంది.

Telugu Allu Aravindh, Chiranjeevi, Aha, Web-

మంచి కంటెంట్‌తో వస్తే తప్పకుండా ఆహా కోసం తాను రెడీగా ఉన్నాను అంటూ చిరంజీవి హామీ ఇచ్చారట.ఈ విషయంలో మరే అనుమానం లేకుండా అల్లు అరవింద్‌ ముందుకు వెళ్లవచ్చు అన్నారట.దాంతో అల్లు అరవింద్‌ ప్రస్తుతం చిరంజీవికి సెట్‌ అయ్యే మంచి కాన్సెప్ట్‌ను పట్టబోతున్నట్లుగా తెలుస్తోంది.గతంలో పలువురు సూపర్‌ స్టార్స్‌ కూడా ఓటీటీ సినిమాలు షోలు చేశారు.

కనుక చిరంజీవి కూడా చేస్తాడనే అంతా నమ్మకంగా చెబుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube