ఒంటరితనానికి అలవాటు పడిన ఓ యువకుడు తన కుటుంబాన్ని అంతం చేయాలని భావించాడు.ఐస్ క్రీంలో విషం కలిపి ఇంట్లో తల్లిదండ్రులకు తినిపించి చంపడానికి ప్లాన్ వేశాడు.
అనుకున్న ప్రకారమే ఆగస్టు 5వ తేదీన ఐస్ క్రీంలో విషం కలిపి తన కుటుంబ సభ్యులకు అందజేశాడు.ఈ మేరకు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తన చెల్లి మృతి చెందడంతో పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
కేరళలోని కాసర్ గడ్ కు చెందిన అల్బిన్ (22) అనే యువకుడు ఒంటరిగా జీవించాలని భావించాడు.అడ్డుగా ఉన్న కుటుంబాన్ని అంతం చేయాలని పన్నాగం పన్నాడు.ఐస్ క్రీంలో విషం కలిపి చంపాలని స్కెచ్ వేశాడు.ఈ మేరకు ఆగస్టు 5న తల్లిదండ్రులకు, చెల్లెలు(16)కు ఐస్ క్రీంలో విషం కలిపి అందించాడు.
ఐస్ క్రీం తిన్న కుటుంబ సభ్యులు తీవ్ర అస్వస్థతకు గురికావడంతో స్థానిక ఆస్పత్రిలో జాయిన్ చేయించారు.బాలిక పరిస్థితి విషమించడంతో ఆమె చికిత్స పొందుతూ మరణించింది.
మిగిలిన వారు చికిత్స పొందుతున్నారు.ఈ మేరకు బంధువుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
ఐస్ క్రీంలో విషం కలిపి చంపడానికి ప్లాన్ చేశానని అల్బిన్ ఒప్పుకోవడంతో పోలీసులు అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.