అక్కడ ఆవు పాలు ఉచితం.. అంతేకాదు అవసరమైతే ఆవు కూడా ఉచితమే..!

ఆవును చాలా మంది దైవంలాగా కొలుస్తారు.ఆవు పాలను అభిషేకాలకు వినియోగిస్తారు.

 Kurnool Man Giving Cow And Cow Milk Free, Kurnool, Cow Milk Free, Cows, Kurnool-TeluguStop.com

అయితే ఇక్కడొక వ్యక్తి ఆవు పాలనే కాదు ఆవులను కూడా ఉచితంగానే ఇచ్చేస్తున్నాడు.కర్నూలు జిల్లాలోని ఓ రైతు చేస్తున్న ఈ పనికి అందరూ ఫిదా అవుతున్నారు.

జిల్లాలోని నందికొట్కూరు మండలంలోని బిజినవేముల గ్రామంలో ఆవుల శీను అనే రైతు ఉన్నాడు.ఆయన ఆవులను చాలా సంవత్సరాల నుంచి పోషిస్తూ వస్తున్నాడు.

శ్రీశైలం నీటి ముంపు గ్రామమైన కొత్త బిజినవేముల గ్రామంలో నివసించే శ్రీనివాసులు 500 ఆవులను మేపుతున్నాడు.ఐదేళ్లుగా ఆవులను అవసరమైన వారికి ఫ్రీగానే ఇచ్చేస్తున్నాడు.

ఆయన ఎటువంటి ఫలితాన్ని కూడా ఆశించడం లేదు.పేదలకు కుటుంబాన్ని నెట్టుకొస్తున్న వారికి ఆవులను ఉచితంగా ఇస్తున్నాడు.

అంతేకాకుండా దేవాలయల కోసం కూడా ఆయన ఉచితంగానే ఆవులును అందజేస్తున్నాడు.చుట్టుపక్కల గ్రామస్తులు ఆవు పాలు కావాలంటే ఇక్కడికే వచ్చేస్తున్నారు.

వారందరికి ఈ రైతు ఉచితంగానే పాలును ఇవ్వడం విశేషం.ఆవు పాలను, ఆవులను ఇలా ఉచితంగా ఇస్తున్న శీను ఇప్పుడు ఆవుల శీనుగా అవతారమెత్తాడు.

పలువురు ఆయన మంచితనాన్ని ప్రశంసిస్తున్నారు.

Telugu Aavula Seenu, Andhra Pradesh, Cow Milk, Cows, Cow, Milk, Kurnool, Kurnool

కర్నూలు జిల్లాకు చెందిన వారికి మాత్రమే ఆవులను శీను ఫ్రీగా ఇవ్వడం చేస్తున్నాడు.ఆయన దగ్గర ఉన్నటువంటి ఏ ఆవు అయినా సరే మరొ దూడకు జన్మనిస్తే వాటిని కూడా కావాల్సిన రైతులకు శీను ఇవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.ఆవు 3 నెలలపాటు పాలు ఇవ్వడం వలన ఆ మూడు నెలలూ కూడా వారి దగ్గరే పెట్టుకోమని ఆవును ఇస్తాడు.

అయితే ఆ మూడు నెలలు అయిపోయిన తర్వాత తన వద్దకే ఆవులను తెచ్చి వదలమంటున్నాడు.ఈ విధంగా శీను ఇప్పటికే చాలా గ్రామాల్లోని ప్రజలకు ఆవులను అందజేశాడు.

కుటుంబ పోషణ కోసం ఒక ఆవు చాలకుండా ఉంటే ఇంకోొ ఆవు కావాలన్నా వారు తీసుకొని పోవచ్చు.అయితే తాను చూసుకునే ఆవులకు సరైన గడ్డి లేదని, స్థలం లేదని శీను అధికారులకు మొరపెట్టుకున్నాడు.

వారు సాయం చేస్తే తమ ఆవులు వల్ల ఇంకొందరు జీవితాలు బాగుపడతాయని శీను తెలిపాడు.శీను చేస్తున్న ఈ పనికి అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube