రవి అస్తమించని సామ్రాజ్యం నేడు తీవ్ర ఆర్థిక సంక్షోభంలో మునిగిపోయింది.అవును, ప్రపంచాన్ని గడగడలాడించిన బ్రిటిష్ సామ్రాజ్యం( Britain ) ఇపుడు దాని ఉనికిని కోల్పోయే ప్రమాదం దాపురించింది.
ప్రపంచ వ్యాప్తంగా ఆర్థికమాంద్యం సంభవించే ఛాన్స్ ఉన్న దేశాల్లో యూకే ముందు వరసలో ఉంది.కోవిడ్ మహమ్మారి కావచ్చు, ఉక్రెయిన్ యుద్ధ పరిణామాలు కావచ్చు, ఇంధన సమస్యలు కావచ్చు ఇలా అన్నీ కలిసి యూకే ఆర్థిక పరిస్థితిని దారుణంగా దిగజార్చాయి.
దాంతో ఇప్పుడు యూకేలో చాలా మంది జీవన వ్యయ సంక్షోభాన్ని (కాస్ట్ అఫ్ లివింగ్ క్రైసిస్)( Cost Of Living Crisis ) ఎదుర్కొంటున్నారు.
దీంతో అక్కడ చాలామంది దొంగతనాలకు పాల్పడుతున్నట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం.గత రెండేళ్లుగా యూకే వ్యాప్తంగా ప్రాథమిక అవసరాల ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి.వచ్చే జీతం కన్నా నిత్యావసరాలపై పెట్టే ఖర్చు అధికంగా ఉండడంతో సామాన్య కుటుంబాలు తాము తినకుండా డబ్బును ఆదా చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.
ఈ నేపథ్యంలో గృహావసరాలను తీర్చడానికి నానాయాతన పడుతున్నారు.
దీంతో, యూకే వ్యాప్తంగా దొంగతనాలు విపరీతంగా పెరుగుతున్నాయి.ముఖ్యంగా నిత్యవసరాలు కొంటున్న సమయాల్లో రిటైల్ షాపుల నుంచి వస్తువులను దొంగిలించడం జరుగుతుందని మెట్రో సర్వేలో తేలింది.10 యువకుల్లో ఒకరు షాపుల్లో దొంగతనాలకు( Shoplifting ) పాల్పడుతున్నట్టు తెలుస్తోంది.ప్రస్తుతం యూకేలో ద్రవ్యోల్భణం రెండంకెల స్థాయికి చేరుకుందని సమాచారం.దొంగతనాల్లో పాలు, చీజ్ వంటివి ఎక్కువగా ఉంటున్నాయని తేలింది.ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్ గణాంకాలు సెప్టెంబరుతో ముగిసిన సంవత్సరంలో షాపుల దొంగతనాలు 22 శాతం పెరిగాయని భోగట్టా.దాంతో దొంగతనాల వల్ల బ్రిటీష్ ఆర్థిక వ్యవస్థపై 660 మిలియన్ పౌండ్ల ప్రభావం పడింది.