ఏపీలో చుక్కల భూముల చిక్కులకు ప్రభుత్వం శాశ్వత పరిష్కారం చూపింది.ఈ మేరకు చుక్కల భూములను 22 ఏ నిషేధిత జాబితా నుంచి తొలగించనున్నారు.
భూ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపిస్తూ రైతులకు ఆ భూములపై పూర్తి హక్కులు కల్పించనున్నారు.ఈ నేపథ్యంలో నెల్లూరు జిల్లా కావలిలో సీఎం జగన్ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.
దీని వలన రాష్ట్ర వ్యాప్తంగా 97 వేల 471 రైతు కుటుంబాలకు మేలు జరగుతుందని సీఎం జగన్ తెలిపారు.చుక్కల భూముల మార్కెట్ విలువ దాదాపు 20 వేల కోట్లు ఉందన్నారు.
ఈ క్రమంలో సుమారు 2 లక్షల 6 వేల 171 ఎకరాల చుక్కల భూములకు హక్కులు రానున్నాయని తెలిపారు.చుక్కల భూముల రైతులకు గత టీడీపీ ప్రభుత్వం అన్యాయం చేసిందని ఆరోపించారు.2016లో చంద్రబాబు ప్రభుత్వం రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది.పుండుమీద కారం చల్లినట్లు చుక్కల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని విమర్శించారు.
కానీ వైసీపీ ప్రభుత్వం రైతుల కోసం చుక్కల భూములను నిషేధిత జాబితా నుంచి తొలగించిందని వెల్లడించారు.







