మహారాష్ట్రలో కరోనా ఏ తీరుగా వ్యాపిస్తుందో అందరికి తెలిసిన విషయమే.ముఖ్యంగా ముంబై, పుణె, నాగ్‌పూర్‌లలో అయితే కోవిడ్‌కు అడ్డు లేకుండా పోతుంది.
ఇక పుణెలో ఉన్న పలు ప్రాంతాల్లోని ఆస్పత్రులు పూర్తిగా కోవిడ్ పేషంట్లతో నిండిపోయాయి.
ఈ క్రమంలో కరోనా లక్షణాలతో బాధపడుతున్న వారి కోసం కొత్తగా తాత్కాలిక గదులు ఏర్పాట్లు చేసి చికిత్స అందించాల్సిన అవసరం ఏర్పడుతుందంటే ఇక్కడ ఉన్న పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.
అదీగాక పింప్రిలోని ఆసుపత్రిలో వెయిటింగ్ ఏరియాలోనూ బాధితులకు ఆక్సిజన్ అందించాల్సిన పరిస్థితి నెలకొందట.
కాగా పింప్రిలోని యశ్వంత్‌రావ్ చవాన్ మెమోరియల్ ఆసుపత్రి సామర్థ్యం 400 పడకలు.
వీటిలో 55 ఐసీయూ పడకలు.అయితే, ఇవన్నీ ప్రస్తుతం కొవిడ్ బాధితులతో నిండిపోయాయి.
అయినా, తాకిడి మాత్రం తగ్గడం లేదు.ఇక రోజురోజుకీ బాధితుల సంఖ్య పెరుగుతుండడం వల్ల వెంటిలేటర్ల కొరత ఏర్పడటంతో రోగుల పరిస్దితి గందరగోళంగా మారిందట.
ఇకపోతే కరోనా వల్ల బాధింపబడుతున్న నగరాల్లో పుణె కూడా ఒకటన్న విషయం తెలిసిందే.