ఇదేంటి జగన్ సార్..? బహుమతి కింద రూ.150 ఇవ్వడమేంటి?

జగన్ ప్రభుత్వం ఏపీలో కొత్త కొత్త పథకాలను ప్రవేశపెడుతూ ప్రజలకు డబ్బులను ధారాళంగా పంచుతోంది.దీంతో తమ ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి పెద్ద ఎత్తున ఖర్చు చేస్తున్నామంటూ జగన్ పార్టీ ప్రచారం చేసుకుంటోంది.

 Controversy On Cm Shourya Scheme In Andhra Pradesh , Andhra Pradesh , Cm Shourya-TeluguStop.com

అయితే కొన్ని పథకాల ద్వారా ప్రజలలో నమ్మకం పోయి, ప్రభుత్వం పడిపోయే అవకాశాలు కనిపిస్తున్నాయి.తాజాగా ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అందరినీ ఆలోచనలో పడేలా చేసింది.

సీఎం శౌర్య పథకం ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

ఒకరకంగా సీఎం శౌర్య పథకంతో జగన్ ప్రభుత్వ పనితీరును అంచనా వేయవచ్చని ప్రజలు భావిస్తున్నారు.

ప్రతి ఏడాది ఉగాది సందర్భంగా రాష్ట్ర పోలీసులకు, అగ్ని మాపక సిబ్బందికి సీఎం శౌర్య పథకం కింద నగదు, ప్రశంసా పత్రాన్ని బహుమతిగా రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంటుంది.దీనికి సంబంధించి తాజాగా జగన్ సర్కారు తీసుకున్న నిర్ణయం ఆయా శాఖల వారికి షాకింగ్‌గా మారింది.

సీఎం శౌర్య పథకం కింద ఇచ్చే నగదు మొత్తాన్ని పెంచటం ఉంటుందే తప్పించి తగ్గించటం ఉండదు.

అయితే ప్రజలకు ఉచితంగా డబ్బులు పంచిపెడుతున్న జగన్ సర్కారు సీఎం శౌర్య పథకం కింద మరే రాష్ట్రంలోనూ లేని రీతిలో భారీ మొత్తాన్ని ఇస్తారని ఎవరైనా ఊహిస్తారు.

కానీ అనూహ్యంగా ఈ పథకం కింద ఇచ్చే నగదును జగన్ ప్రభుత్వం తగ్గించింది.గతంలో సీఎం పేరు మీద ఇచ్చే శౌర్య పతకం విలువ రూ.500 ఉండేది.అయితే జగన్ ప్రభుత్వం హఠాత్తుగా రూ.500 ఇవ్వలేమని.సీఎం శౌర్య పథకం కింద ఇచ్చే మొత్తాన్ని రూ.150కి తగ్గిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.

Telugu Andhra Pradesh, Cm Jagan, Controversycm, Ysrcp-Telugu Political News

ఇప్పటివరకు వస్తున్న మొత్తంలో రూ.350 కోత పెట్టిన ప్రభుత్వాన్ని చూసి ఎలా స్పందించాలో తెలియక పలువురు అధికారులు సతమతం అవుతున్నారు.జగన్ అమలు చేస్తున్న పొలిటికల్ అజెండాను తూచా తప్పకుండా ఫాలో అవుతున్నారన్న ఆరోపణల్ని పెద్ద ఎత్తున మూట కట్టుకున్న పోలీసులకు సీఎం జగన్ ఇలాంటి నజరానా ఇవ్వటం అనేది హాట్ టాపిక్‌గా మారింది.

ఇదేంటి జగన్ సార్.? బహుమతి కింద రూ.150 ఇవ్వడమేంటి అని పలువురు సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube