తల్లి కాంగ్రెస్ కి దగ్గరవుతున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్! రాజకీయాలలో ఆసక్తికర చర్చ  

కాంగ్రెస్ పార్టీకి దగ్గరవుతున్న జగన్. .

Congress Party Plan To Connect With Ys Jagan-congress Party,plan To Connect With Ys Jagan,tdp,ysrcp

ఏపీలో సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుకి సమయం దగ్గర పడుతుంది. ఈ సారి ఎలా అయినా ఏపీలో అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి పీఠం మీద తాను కూర్చుంటా అని వైసీపీ అధినేత జగన్ గట్టి నమ్మకంతో ఉన్నాడు. ఇక ఏపీ రాజకీయ వర్గాలలో, అలాగే మీడియా సర్వేలలో కూడా వైసీపీ అధికారంలోకి రాబోతుంది అనే మాట బలంగా వినిపిస్తుంది..

తల్లి కాంగ్రెస్ కి దగ్గరవుతున్న వైఎస్ ఆర్ కాంగ్రెస్! రాజకీయాలలో ఆసక్తికర చర్చ-Congress Party Plan To Connect With YS Jagan

అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం టీడీపీ గెలుపుపై నమ్మకంతో ఉన్న ఇంకా ఏదో లోలోపల టెన్షన్ పడుతున్నట్లు కనిపిస్తున్నారు.

ఒక వేళ ఓడిపోతే కాంగ్రెస్ కి దగ్గరై కేంద్రంలో చక్రం తిప్పాలని చంద్రబాబు వేస్తున్న వ్యూహాలకి వైసీపీ నుంచి దెబ్బ తగలబోతుంది అనే టాక్ ఇప్పుడు రాజకీయాలలో సంచలనంగా మారింది. కేంద్రంలో అధికారంలోకి రావాలని ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తనకున్న ఎ ఒక్క అవకాశాన్ని వదులుకోవడానికి సిద్ధంగా లేదు.

ఈ నేపధ్యంలో ఏపీలో వైసీపీ బలం కూడా తనకి కలిసొచ్చే విధంగా చేసుకోవాలని వ్యూహాత్మక అడుగులు వేస్తున్నట్లు తెలుస్తుంది.

కాంగ్రెస్ పార్టీ నుంచి బయటకి వచ్చి జగన్ పార్టీ పెట్టాడు కాబ్బట్టి, ఎలా అయిన జగన్ ని ఒప్పించి తమకి మద్దతు ఇచ్చేలా చేసుకోవాలని కాంగ్రెస్ పెద్దలు యోచిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే ప్రత్యేక హోదా ఇచ్చే పార్టీకి తమ మద్దతు అని ప్రకటించిన జగన్ కేంద్రంలో కాంగ్రెస్ కి సపోర్ట్ ఇచ్చిన ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని టాక్ రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది. మరి అదే జరిగితే చంద్రబాబు తన వ్యూహాలని ఎలా మార్పులు చేసుకుంటాడు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.