చంద్రయాన్-3తో పోటీపడ్డ లూనా-25 క్రాష్ ల్యాండింగ్.. బెడిసికొట్టిన రష్యా ప్లాన్..!

భారతదేశానికి చెందిన ఇస్రో జూలై 14న చంద్రయాన్-3( Chandrayaan-3 ) ను చంద్రునిపై పరిశోధనలు చేసేందుకు అంతరిక్షంలోకి పంపించిన సంగతి మనందరికీ తెలిసిందే.అయితే చంద్రునిపై భారత్ కంటే ముందుగా చేరి పరిశోధనలు చేయాలని రష్యా చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.

 Competing With Chandrayaan-3, The Crash Landing Of Luna-25 Russia's Plan Is Mess-TeluguStop.com

రష్యా పంపించిన స్పేస్ క్రాఫ్ట్ లూనా-25 చిట్టచివరి నిమిషంలో క్రాష్ ల్యాండింగ్ అవడంతో మిషన్ ఘోరంగా విఫలమైంది.

సాధారణంగా చంద్రునిపై ల్యాండింగ్ అయ్యే సమయంలో ఏ స్పేస్ క్రాఫ్ట్ అయినా తన వేగాన్ని నియంత్రించుకుని తన కంట్రోల్లోకి తెచ్చుకోవాలి.

అలా నియంత్రించుకోవడంలో రష్యా( Russia ) అంతరిక్ష పరిశోధకులు పూర్తిగా విఫలమయ్యారు.దీంతో లూనా-25 అతివేగంగా చంద్రుని ఉపరితలాన్ని ఢీ కొట్టి ముక్కలైంది.ఈ విషయాన్ని స్వయంగా రష్యా అధికారికంగా ప్రకటించింది.రష్యా అంతరిక్ష పరిశోధన సంస్థ రోస్ కాస్మోస్( Rose Cosmos ) ఒక ప్రకటన విడుదల చేసింది.లూనా-25 ల్యాండింగ్ సమయంలో సాంకేతిక లోపాలు తలెత్తాయి.ఫలితంగా చందుని ఉపరితలంపై కుప్పకూలిపోయింది.

గతంలో 2019లో ఇస్రో పంపించిన చంద్రయాన్-2 ఏ విధంగా క్రాష్ ల్యాండింగ్ అయ్యిందో.అచ్చం అలాగే లూనా-25 క్రాష్ ల్యాండింగ్ అవ్వడం జరిగింది.

Telugu Chandrayaan, General, Latest Telugu, Luna, Rose Cosmos, Russia, Russian-L

రష్యా చంద్రునిపై ప్రయోగాలు చేసిన 47 సంవత్సరాల తర్వాత మళ్లీ పూనుకుంది.లూనా-25( Luna-25 ) పేరుతో ఆగస్టు 10వ తేదీన ఈ అంతరిక్ష నౌక చంద్రుని వైపు దూసుకెళ్లింది.రష్యా ఫార్ ఈస్ట్ రీజియన్ లో ది వోస్టోఖ్ని కస్మో డ్రోమ్ నుంచి ఈ రాకెట్ ను పంపించింది.

Telugu Chandrayaan, General, Latest Telugu, Luna, Rose Cosmos, Russia, Russian-L

రష్యా కాలమానం ప్రకారం, శనివారం మధ్యాహ్నం 2:57 నిమిషాలకు చంద్రుని యొక్క దక్షిణ ధ్రువ ఉపరితలంపై లూనా-25 ల్యాండింగ్ అవ్వాల్సి ఉండేది.అయితే ల్యాండింగ్ అవ్వడానికి కేవలం కొద్ది నిమిషాల ముందు ఈ రాకెట్ తో రష్యా శాస్త్రవేత్తలకు ఉన్న సంబంధాలు తెగిపోయాయి.రష్యా శాస్త్రవేత్తలు సంబంధాలను పునరుద్దరించుకోవడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు.అయితే ఈ నౌక సాఫ్ట్ ల్యాండింగ్ అయి ఉండొచ్చని రష్యా శాస్త్రవేత్తలు భావించడం లేదు.లూనా-25 నుంచి ఇప్పటివరకు ఎటువంటి సమాచారం కానీ, డేటా కానీ అందలేదని రష్యా స్పష్టం చేసింది.లూనా-25 చంద్రుని ఉపరితలాన్ని ఢీ కొట్టి పేలిపోయి ఉండొచ్చని రష్యా శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.దీనిపై సమగ్ర విచారణ కోసం ప్రత్యేకంగా ఓ ఇంటర్ డిపార్ట్మెంటల్ కమిషన్ ను నియమించినట్లు రష్యా పేర్కొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube