KCR : కేసిఆర్ పోటీ గజ్వేల్ నుండి కాదా.. ఎక్కడినుంచంటే..?

తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికల వేడి రాజుకుంటోంది.ఇప్పటికే అన్ని పార్టీల నాయకులు వారి వారి నియోజకవర్గాల్లో ప్రచార హడావిడిలో మునిగిపోయారు.

 Cm Kcr To Contest From Kamareddy Instead Of Gajwel-TeluguStop.com

ప్రస్తుతం బిఆర్ఎస్ (BRS) పార్టీలో మాత్రం టికెట్ల కోసం ఎంతోమంది నాయకులు ఎదురుచూస్తున్నారు.అయితే ఇందులో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు రాకపోవచ్చు అనే విషయం బయటకు వచ్చింది.

ఈ తరుణంలో చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలు భయపడిపోతున్నారు.ఇవన్నీ పక్కన పెడితే సీఎం కేసీఆర్ (CM KCR) పోటీ చేసినటువంటి గజ్వేల్ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.

ఇప్పటికే బీజేపీ పార్టీ నుంచి ఈటల రాజేందర్ (Etela Rajender) గజ్వేల్ నుంచి సీఎం కేసీఆర్ కు పోటీగా వస్తున్నారని తెలిసింది.ఇందులో నిజమేంటో అబద్ధమేంటో తెలియదు కానీ వార్త మాత్రం వైరల్ గా మారింది.

ఈ తరుణంలోనే సీఎం కేసీఆర్ పోటీ చేసేది గజ్వేల్ (Gajwel) నుంచి కాదని మరో నియోజకవర్గం నుంచి పోటీ చేయబోతున్నారని ఒక వార్త వినిపిస్తోంది.మరి పూర్తి వివరాలు ఇప్పుడు చూసేద్దాం.

Telugu Brs Tickets, Brs Mlas, Cmkcr, Etela Rajender, Gajwel, Gampa Govardan, Kam

తప్పనిసరిగా సీఎం కేసీఆర్ ఈసారి గజ్వేల్ నియోజకవర్గం నుంచి పోటీ చేయడం లేదనేది ఈ వార్తలు చూస్తే అర్థమవుతుంది.అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ కామారెడ్డి (Kamareddy) నుంచి పోటీ చేస్తారని, కామారెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యే గంప గోవర్ధన్ అన్నారు.100% కామారెడ్డి నుంచి పోటీ చేస్తారని ఈయన బల్లగుద్ది చెప్పారు.అలాగే తాను కామారెడ్డి నుంచి పోటీ చేయాలని నేను మూడుసార్లు కోరానని అన్నారు.

Telugu Brs Tickets, Brs Mlas, Cmkcr, Etela Rajender, Gajwel, Gampa Govardan, Kam

కెసిఆర్ పోటీ చేస్తే నేను ఒక సామాన్య కార్యకర్తగా ఉండి గెలిపించుకుంటానని గోవర్ధన్ ( MLA Gampa Govardan ) తెలియజేశారు.అయితే కేసీఆర్ ఇక్కడి నుంచి పోటీ చేయడానికి ఒక ప్రత్యేకత కూడా ఉంది.కామారెడ్డి నియోజకవర్గం లోని కోనాపూర్ కేసీఆర్ భార్య పుట్టిన ఊరు.అంటే అత్తగారి గ్రామం అన్నమాట.ఈ తరుణంలోనే ఆయన అక్కడి నుంచి పోటీ చేయాలని గంప గోవర్ధన్ కోరినట్టు సమాచారం.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube