కేసీఆర్ ఈ అసంతృప్తి చూశారా...!

అవును! తెలంగాణ సీఎం కేసీఆర్ కూసాలు క‌దులుతున్నాయి.పెద్ద నోట్ల ర‌ద్దుతో భారీ ఎత్తున త‌లెత్తుతున్న ఇబ్బందులు ఇప్పుడు ఆయ‌న పార్టీకి కూడా తాకాయి.

 Cm Kcr In Trouble Due To Currency Ban-TeluguStop.com

చిల్ల‌ర‌ నోట్లు లేక అనేక కార్య‌క్ర‌మాల‌కు మంగ‌ళం పాడాల్సిన ప‌రిస్తితి వ‌చ్చింది.దీంతో టీఆర్ ఎస్ కేడ‌ర్‌లో పూర్తిస్థాయిలో అసంతృప్తి నెల‌కొంది.

బంగారు తెలంగాణ ల‌క్ష్య సాధ‌న‌లో భాగంగా ఇప్ప‌టికే 10 జిల్లాల తెలంగాణ‌ను 31 జిల్లాల మ‌హాతెలంగాణ‌గా మార్చిన కేసీఆర్ వాటికి పార్టీ నేత‌ల‌ను నియ‌మించాల్సి ఉంది.ఈ క్ర‌మంలో ఆయన భారీ కార్య‌క్ర‌మాల‌కే శ్రీకారం చుట్టారు.

అయితే, అంతా ఇప్పుడు రివ‌ర్స్ అయింది.

పార్టీ కేడ‌ర్‌లో పెద్ద ఎత్తున ఉత్సాహం నింపి 2019 నాటికి వారిని తిరిగి ఎన్నిక‌ల ర‌ణ క్షేత్రానికి సిద్ధం చేయాలని కేసీఆర్ భావించారు.

అదేస‌మ‌యంలో వివిధ పార్టీ ల నుంచి వ‌చ్చి కారెక్కిన వారికి కూడా సంతృప్తి క‌దిలేలా వారికి ప‌ద‌వులు క‌ట్ట‌బెట్టాల‌ని భావించారు.అయితే, ఇప్ప‌టి వ‌ర‌కు ప‌రిస్థితి వేరు.

ఇప్పుడున్న ప‌రిస్థితి వేరుగా మారింది.నోట్ల ర‌ద్దుతో ఏ కార్య‌క్ర‌మం చేయాల‌న్నా ఆలోచించాల్సిన ప‌రిస్తితి ఏర్ప‌డింది.

దీంతో కేసీఆర్ అన్ని ప‌నుల‌నూ వాయిదా వేసుకోవ‌డ‌మే కాకుండా అనేక కార్య‌క్ర‌మాల‌ను సైతం ప‌క్క‌న పెట్టారు.

కొత్త క్యాడ‌ర్ తో రాబోయే రెండున్నరేళ్లు.

ప్రజల్లోకి దూసుకెళ్లాలని ప్లాన్ చేశారు.డిసెంబ‌ర్ 2న రెండున్నరేళ్ల సంబురాలు ఘనంగా చేసుకుని ప్రజల్లోకి వెళ్లాలని గులాబీబాస్ స్కెచ్ వేశారు.

స‌భ‌లు, స‌మావేశాలు, సంబురాలు జరుపుకుంటూ సంక్షేమ పథకాలను ప్రచారం చేయాలని భావించారు.కానీ పెద్దనోట్ల దెబ్బతో పార్టీ పదవులతోపాటు సభలు, సంబురాలు లేకుండాపోతున్నాయని కేడర్ మదనపడుతోంది.

ఇదిలా ఉంటే ఇప్పుడు పార్టీలో, నాయకుల్లోనూ కరెన్సీ సమస్య ఏర్పడింది.అందుకే ఇప్పుడున్న పరిస్థితుల్లో పదవుల ప్రకటన కానీ.

పార్టీ కార్యక్రమాలు కానీ చేసే పరిస్థితి లేదంటున్నారు సీనియర్లు.ఈ ఏడాదికి ఇంతేనని అంటున్నారు.

సో.దీంతో కేసీఆర్‌కు అసంతృప్తుల జాబితా పెరిగిపోతోంది.మ‌రి ఇదే అసంతృప్తి 2019 వ‌ర‌కు కొన‌సాగితే.ఇబ్బందే!!

.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube