పెద్ద నోట్లను రద్దు చేయాలని తానే సూచించానని, తానే లేఖ కూడా రాశానని చెబుతున్న టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పుడు ఆ నోట్ల రద్దుతో తన కొంపే మునిగిపోతోందని బాధపడుతున్నారా? ఏదైతే తాను కోరుకున్నారో.అది జరగకపోగా.
లేనిపోని తంటాలన్నీ తనకే చుట్టుకుంటున్నాయని వాపోతున్నారా? అంటే ఔననే ఆన్సరే వస్తోంది.వాస్తవానికి చంద్రబాబు పెద్ద నోట్ల రద్దుపై పెద్ద మంత్రాంగమే సిద్ధం చేశారు.
రాష్ట్రంలో తాను తిరిగి అధికారంలోకి రావాలంటే విపక్ష వైకాపా దూకుడుకి అడ్డుకట్ట వేయాలని ఆయన డిసైడ్ అయ్యారు.ముఖ్యంగా జగన్ ఆర్థిక మూలాలపై వేటే వేయడం ద్వారా అనుకున్నది సాధించొచ్చని ఆయన భావించారట!
ఈ క్రమంలోనే చంద్రబాబు పెద్ నోట్ల రద్దు కోరుతూ కేంద్రానికి పలు మార్లు సిఫారసులు పంపారని టీడీపీ తమ్ముళ్లు చెబుతున్నారు.
అంతేకాదు, చంద్రబాబు సైతం.మొన్నామధ్య నిర్వహించిన మీడియా మీటింగ్‌లోనూ రూ.1000 నోట్లు రద్దు చేయాల్సిందేనని కోరుతూ తాను లేఖ రాసినట్టు చెప్పారు.అయితే,ఈ నోట్ల రద్దుతో చంద్రబాబు శత్రువు జగన్ పరిస్థితి ఏమాత్రం మారలేదని ఇప్పుడు వార్తలు వస్తున్నాయి.
అదేసమయంలో ఈ పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చంద్రబాబే ఇబ్బందుల్లో పడిపోయారని తెలుస్తోంది.
ముఖ్యంగా ఈ నెల 1 నుంచి ప్రారంభించిన టీడీపీ సభ్యత్వ నమోదు పూర్తిస్థాయిలో నిలిచిపోయిందట.
పెద్ద నోట్ల రద్దు ప్రభావం దీనిపై ఎక్కువగా ఉందని టీడీపీ శ్రేణులే చెబుతున్నాయి.నిజానికి సభ్యత్వ రుసుము కేవలం రూ.100 అయితే, ఇప్పుడు ఆ వంద ఉన్న వాడే అపర కోటీశ్వరుడుతో సమానం.కాబట్టి ఎట్టి పరిస్థితిలోనూ టీడీపీ నేరుగా రూ.100 చెల్లించి సభ్యత్వం తీసుకునే పరిస్థితిలేదు.దీంతో ఇప్పుడు ఈ కార్యక్రమం దాదాపు ఏపీ, తెలంగాణల్లో నిలిచిపోయింది.
మరోపక్క, పట్టణాలు, గ్రామాల్లో ఎక్కడా జనాలు కూడా కనిపించడం లేదు.అందరూ బ్యాంకుల వద్ద క్యూలైన్లలోనూ కనిపిస్తున్నారు.
ఇక, ఈ క్రమంలో బాబు అనుకున్నది ఒక్కటి అయింది ఒకటి అని తెలుగు తమ్ముళ్లు నవ్వుకుంటున్నారు.ఇదీ పరిస్థితి!!
.






