మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య పోటి అంటే ఆ ఆసక్తి , ఆ హంగామా వేరు.రెండంకెల సార్లు పోటి పడగా, కొన్నిసార్లు చిరంజీవిది పైచేయి అయితే, మరికొన్ని సార్లు బాలయ్యది పైచేయి అయ్యింది.
అయితే, గతం గతః అని అంటారు.ఇప్పుడు మరోసారి ఈ ఇద్దరు బాక్సాఫీస్ వద్ద పోటిపడబోతున్నారు.వచ్చే సంక్రాంతికి చిరంజీవి 150వ సినిమా ఖైదీ నం.150, బాలకృష్ణ 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి ఖాయంగా వస్తున్నాయి.
చిత్రం విడుదలకి ముందు, ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో కూడా పొటి పడతారు హీరోలు, అభిమానులు.మరి బిజినెస్ విషయంలో విజేత ఎవరో తెలుసా? ఇంకెవరు మెగాస్టార్ చిరంజీవి.నైజాం, ఆంధ్రప్రదేశ్, ఓవర్సీస్, కర్ణాటక అని తేడా లేకుండా ప్రతీ ఏరియాలో గౌతమీపుత్ర శాతకర్ణిపై పైచేయి సాధిస్తోంది ఖైదీ నం.150.ప్రిరీలీజ్ బిజినెస్ విషయంలో చిరంజీవి సినిమాకి చాలాదూరంలో నిలుస్తున్నాడు బాలయ్య బాబు.
ఆరకంగా మొదటిదశలో విజయం మగాస్టార్ దే.అయితే అప్పుడే ఆట పూర్తవ్వలేదు.అసలు కథ విడుదల సమయంలో మొదలవుతుంది.
అప్పుడు చూద్దాం, ఎవరు ఎలాంటి ఓపెనింగ్స్ రాబడతారో, ఎవరు నిర్మాతకి ఎంత కలెక్షన్ తెచ్చిపెడతారో!
.