పేదరికం అనేది ఈ ప్రపంచ పటంలో వున్న ఏదేశానికైనా వర్తిస్తుంది.ఎంత అభివృద్ధి పధంలో నడుస్తున్న దేశానికైనా ఎక్కడో ఒకమూలన దారిద్య్రం తాండవం చేస్తూ ఉంటుంది.
ఆయా ప్రాంతాల వాతావరణం లేదా మౌలిక వనరుల దృష్ట్యా పేదరికం అనేది ఏర్పడి ఉంటుంది.అయితే చైనా దేశం( China ) మాత్రం తమ దేశంలో ఆస్థితే తలెత్తదు అన్నట్టుగా మేకపోతు గాంభీర్యం నటిస్తోంది.
అందుకు సంబంధించి చిన్న విషయం కూడా బయటకు రాకుండా జాగ్రత్త పడుతోందని న్యూయార్క్ టైమ్స్( New York Times ) తాజాగా పేర్కోవడం విశేషం.
ఈ క్రమంలో పేదరికానికి సంబంధించిన ఆన్‌లైన్ వీడియోలను కూడా తొలగించి, బ్యాన్ చేస్తోందని తాజా సర్వేలో వెల్లడైంది.అందుకు ఉదహరణగా న్యూయార్క్ టైమ్స్ చైనాలోని కొన్ని ఆన్‌లైన్ వీడియోల( Online videos ) గురించి వెల్లడించడం గమనార్హం.ఆయా వీడియోల్లో ఓ మహిళ ఇటీవలే తాను పదవీ విరణమ పొందానని, తన జీతం 100 యువాన్లని, ఈ సొమ్ముతో ఎంత కిరాణ సామాగ్రిని కొనగోలు చేయవచ్చో చెప్పండి అని వాపోయింది.
అదే విధంగా యువ గాయకుడు ఉద్యోగావకాశాల గురించి సోషల్ మీడియా వేదికగా నిరాసక్తతను వ్యక్తం చేశాడు.
అయితే ఆయా వ్యక్తుల సోషల్ మీడియా ఖాతాలను మరుక్షణమే చైనా బ్యాన్ చేసింది.పైగా సదరు వ్యక్తుల ఇంటికి ఎవరూ అప్రోచ్ కాకుండా ఉండేలా అధికారులు ఇంటి వద్దే మోహరించి వున్నారని చెప్పడం బాధాకరం.చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్( Jinping ) ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే వీడియోలను, ఆర్థికపరిస్తితికి సంబంధించిన ఇలాంటి వీడియోలు లేదా పోస్టులు ప్రచురించే వారిపై కఠినంగా వ్యవహరిస్తారని విశ్వసనీయ వర్గాల సమాచారం.
చైనాకు సంబంధించినంత వరకు సానుకూల విషయాలనే ఉంచడానికే ప్రయారిటీ ఇస్తుంది అక్కడి ప్రభుత్వం.కేవలం చైనా కమ్యానిస్ట్ పార్టీ గత నాలుగు దశాబ్దాలుగా ఎంతమందిని పేదరికం నుంచి బయటకు తీసుకువచ్చిందనే దాని గురించే గొప్పగా చెప్పుకుంటుంది.